Mallu Ravi: వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటున్నారు
ABN, Publish Date - Sep 14 , 2024 | 04:09 AM
బీఆర్‌ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని
బీఆర్‌ఎస్ నేతలు నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్ర పోషించట్లే: మల్లు రవి
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని, వారిలో వారే కొట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. పోలీసులపైనే దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి చర్యల ద్వారా హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు, పెట్టుబడులు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇలా వ్యవస్థలపై దాడులు చేయలేదన్నారు.
Updated Date - Sep 14 , 2024 | 04:09 AM