ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి..

ABN, Publish Date - Jan 28 , 2024 | 04:48 PM

దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని మల్లు రవి అన్నారు.

దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని మల్లు రవి అన్నారు. ఈ పదవిని తాను బాధ్యతగా నిర్వర్తిస్తానని, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. తనను ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ నేతలకు మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులవడంపై వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేతలు అభినందించారు.

"తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్, కంటోన్మెంట్ వద్ద రక్షణ శాఖ భూములు సహా అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క 15 అంశాల పట్ల ప్రధానికి విజ్ఞాపనలు అందజేశారు. ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్రం రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలి. నీటి ప్రాజెక్టులు, ఆర్ధిక, రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నాలుగేళ్లు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. నమ్మకం, పనిచేసే సమర్ధత గుర్తించి నాకు ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు రేవంత్ రెడ్డి ఇచ్చారని" మల్లు రవి వెల్లడించారు.

Updated Date - Jan 28 , 2024 | 05:58 PM

Advertising
Advertising