Mohanbabu vs Manoj: మంచు మనోజ్‌కు గాయాలు..
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:53 PM
Mohanbabu vs Manoj: సినీ నటుడు, మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబుతో జరిగిన ఘర్షణలో గాయాలవడంతో అతను ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.
Mohanbabu vs Manoj: సినీ నటుడు, మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబుతో జరిగిన ఘర్షణలో గాయాలవడంతో అతను ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆస్తి విషయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు అనుచరులు వినయ్ తనపై దాడి చేసినట్లు మనోజ్ ఆరోపించారు. వినయ్‌తో పాటు.. మరికొందరు కూడా తనను కొట్టారని మనోజ్ ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
ఈ ఘర్షణలో మనోజ్ కాలికి బలమైన గాయాలయ్యాయట. దీంతో మనోజ్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బంజారాహిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌లో మనోజ్‌ను చేర్పించారు. ఆయన భార్య భూమా మౌనిక మరికొంత మందితో ఆస్పత్రికి వచ్చిన ఆయన.. అడ్మిట్ అయ్యారు. కాళ్లకు బలమైన గాయం కావడంతో.. వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Updated Date - Dec 08 , 2024 | 05:11 PM