ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchu Manoj: నేను రమ్మంటేనే మీడియా లోపలికి..

ABN, Publish Date - Dec 15 , 2024 | 04:10 AM

సినీ నటుడు మోహన్‌ బాబు నివాసంలో మీడియాపై దాడి ఘటనపై అతని కుమారుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఈ విషయంలో మీడియా వారి తప్పేమీ లేదని, తాను రమ్మంటేనే మీడియా వారు తమ ఇంట్లోకి వచ్చారని స్పష్టం చేశారు.

  • నిస్సహాయ స్థితిలో నేనే ఆశ్రయించా

  • వాళ్ల తప్పులేదు.. ఎక్స్‌లో మంచు మనోజ్‌

  • నాపై రెండ్రోజుల్లో రెండు సార్లు దాడి

  • ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్య

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు మోహన్‌ బాబు నివాసంలో మీడియాపై దాడి ఘటనపై అతని కుమారుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఈ విషయంలో మీడియా వారి తప్పేమీ లేదని, తాను రమ్మంటేనే మీడియా వారు తమ ఇంట్లోకి వచ్చారని స్పష్టం చేశారు. నిస్సహాయ స్థితిలో తానే మీడియాను ఆశ్రయించానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో శనివారం ఓ పోస్టు చేశారు. తొమ్మిది నెలల వయస్సున్న తన బిడ్డను జల్‌పల్లిలోని ఇంట్లోనే ఉంచి.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు డిసెంబరు 10న తన భార్యతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లానని మనోజ్‌ పేర్కొన్నారు. అయితే, సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్లకుండా తనని అడ్డుకున్నారని తెలిపారు. దీంతో గేటును బద్దలుకొట్టి తాను లోపలికి వెళుతుండగా బౌన్సర్లు, భద్రతా సిబ్బంది తనపై దాడి చేశారని ఆరోపించారు.


ఈ క్రమంలో తన చొక్కా చిరిగిందని, తెల్ల దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఛాతీపై కొట్టాడని పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం తాను అతన్ని దూరంగా నెట్టానని తెలిపారు. ఆ సమయంలో తాను మద్యం మత్తులో లేనని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో తనపై రెండు సార్లు దాడి జరిగిందని చెప్పారు. ఇలా తనని అడ్డుకుంటుండంతో చిరిగిన చొక్కాతో నిస్సహాయ స్థితిలో బయటకు వచ్చి మీడియా సాయం కోరినట్టు మనోజ్‌ వివరించారు. ఆ రెండు రోజులు తమ నివాసంలో ఏం జరిగిందో తెలియాలంటే సీసీ కెమెరా ఫుటేజీలను బయటపెట్టాలని తన సోదరుడు మంచు విష్ణుకు సన్నిహితుడైన రాజ్‌ కొండూరును డిమాండ్‌ చేశారు. ఈ వివాదానికి సంబంధించి కిరణ్‌, విజయ్‌ అనే ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారని, సీసీ ఫుటేజీల ఆధారంగా వారిని విచారిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని మనోజ్‌ పేర్కొన్నారు.


ఆ కాసేపు కనిపించని విష్ణు

ఇక, తనపై దాడి చేసి చొక్కా చిరిగిన సమయంలో మంచు విష్ణు కాసేపు కనిపించకుండా పోయాడని మనోజ్‌ ఆరోపించారు. తన తండ్రి మోహన్‌ బాబు మీడియా వారిపై దాడి చేసి ఇంట్లోకి తిరిగి వెళ్లిన తర్వాత తిరిగి విష్ణు బయటికొచ్చాడని తెలిపారు. తమ తండ్రిని విష్ణు ఆస్పత్రికి తీసుకెళ్లాడని చెప్పారు. దీనిని కొన్ని గంటల ముందు తనకు మద్దతుగా వచ్చిన వారిని విష్ణు భయపెట్టేందుకు యత్నించారని ఆరోపించారు. అవసరమైతే ఆయుధాలు కూడా తెప్పిస్తానని తన బౌన్సర్లకు విష్ణు చెప్పాడని అన్నారు. అయితే, తన కుటుంబం పట్ల వినయ్‌ వ్యవహరిస్తున్న తీరు అన్యా యం, అనైతికమని మనోజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎక్కడికీ పారిపోనని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 04:10 AM