ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manjira water: 30న మంజీరా నీళ్లు బంద్‌..

ABN, Publish Date - Jul 28 , 2024 | 10:31 AM

పటాన్‌చెరు(Patancheru)లోని వాల్యూ జోన్‌ వద్ద జంక్షన్‌ పనుల కారణంగా నగరానికి మంజీరా(Manjira) నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు(Waterboard) ప్రకటించింది. ఈనెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపింది.

- పలుచోట్ల సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ సిటీ: పటాన్‌చెరు(Patancheru)లోని వాల్యూ జోన్‌ వద్ద జంక్షన్‌ పనుల కారణంగా నగరానికి మంజీరా(Manjira) నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు(Waterboard) ప్రకటించింది. ఈనెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాలకు పూర్తిగా, మరికొన్ని ప్రాంతాలకు పాక్షికంగా సరఫరా నిలిచిపోతుందని పేర్కొంది. ప్రధానంగా బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌(BHEL TOWNSHIP), హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, పటాన్‌చెరు ఇండస్ర్టియల్‌ ఏరియా, పటాన్‌చెరు పట్టణం, రామచంద్రాపురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, మదీనాగూడ(Jyotinagar, Lingampally, Chandanagar, Gangaram, Medinaguda), హఫీజ్‌పేట, డోయెన్స్‌ కాలనీ, ఎస్‌బీఐ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందని సూచించింది.

ఇదికూడా చదవండి: Projects in Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.. ప్రస్తుత నీటి మట్టాలు ఇవే


...............................................................................................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................

10 కిలోల బంగారు బిస్కెట్లు

- ‘వాల్మీకి’ అవినీతి కేసులో నిందితుడి నుంచి స్వాధీనం

- నగరంలో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తింపు

బెంగళూరు: వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ అవినీతి కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు హైదరాబాద్‌లో ఓ నిందితుడి ఇంట్లో 10 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కూడా విచారిస్తున్నారు. అవినీతి సొమ్ముతో నిందితుడు కొనుగోలు చేసినట్లు భావిస్తున్న బంగారాన్ని గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఫస్ట్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ సత్యనారాయణ వర్మను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. బ్యాంకు ఖాతా ద్వారా వచ్చిన సొమ్ముతో 35 కిలోల బంగారాన్ని ఆయన కొనుగోలు చేసినట్లు తెలిసింది. అందులో 20 కిలోల బంగారాన్ని అవినీతిలో భాగస్వామ్యులైన వారికి పంచిపెట్టానని, 15 కిలోల బంగారం ఇంకా తన ఫ్లాట్‌లోనే ఉన్నట్లు విచారణలో వెల్లడించారు. దీంతో సిట్‌ అధికారులు అతడి ఫ్లాట్‌లో సోదా చేసి 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 5 కిలోల కోసం సోదా చేస్తున్నారు.


ఫ్లాట్లు కొనుగోలు

సత్యనారాయణవర్మ, అతడి సహచరులు వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకుని హైదరాబాద్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించి వాటి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వర్మకు సంబంధించిన ఒక ఫ్లాట్‌లో గతంలో దాడి చేసినప్పుడు రూ.1.82 కోట్ల నగదు, నోట్ల లెక్కింపు మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు చెందిన 18 ఖాతాలకు వాల్మీకి కార్పొరేషన్‌ నుంచి రూ.94.73 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత 270కు పైగా నకిలీ ఖాతాలను తెరిచి నగదు బదిలీ చేశారు.


ఇదికూడా చదవండి: Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 28 , 2024 | 10:31 AM

Advertising
Advertising
<