Etala Rajender: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దేశం అప్పుల కుప్పగా మారింది
ABN, Publish Date - Feb 26 , 2024 | 10:38 PM
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దేశం అప్పుల కుప్పగా మారుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. సోమవారం నాడు సిద్దిపేట పట్టణంలో బీజేపీ విజయసంకల్ప యాత్ర నిర్వహించింది.
సిద్దిపేట: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దేశం అప్పుల కుప్పగా మారుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. సోమవారం నాడు సిద్దిపేట పట్టణంలో బీజేపీ విజయసంకల్ప యాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... దేశానికి సేవకుడిని తప్ప ఓనర్ అని ఏనాడూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పలేదని అన్నారు. ప్రపంచానికి అపద వస్తే ఆదుకునే శక్తి భారత్‌కు ఉందని.. కానీ భారత్‌కు అపద వస్తే ఆదుకునే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదని చెప్పారు.
బీఆర్ఎస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తే వ్యర్థమేనని చెప్పారు. కేంద్రంలో అధికారంలో లేని, రాని కాంగ్రెస్‌కు మళ్లీ ఓటు వేస్తే వృథానే అన్నారు. అధికారంలోకి వస్తే రూ.4000 పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇంత వరకు ఇవ్వలేదన్నారు. రూ. 2500 భృతి, వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ చరిత్ర గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదని అందుకే అలవికాని హామీలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే రాజకీయాల నుంచి విరమించుకుంటానని అని సవాల్ విసిరారు. నరేంద్రమోదీ పేదింటి బిడ్డ.. దొర బిడ్డ కాదు.. కాబట్టే పేదలకు ఇల్లు కట్టిస్తున్నారని చెప్పారు. కేంద్రం 2.30 లక్షల ఇళ్లు ఇస్తే.. తెలంగాణ కట్టినవి లక్ష కూడా లేవు, పంచినవి 30 వేలు కూడా లేవని అన్నారు. దేశంలో నరేంద్రమోదీ 4 కోట్ల ఇల్లు కట్టించారని చెప్పారు. కేసీఆర్ ఇల్లు కట్టిస్తే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో కట్టవచ్చు కానీ, రాష్ట్రంలో ఎక్కడా కట్టలేదని ఈటల రాజేందర్ అన్నారు.
Updated Date - Feb 26 , 2024 | 10:38 PM