HarishRao; సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కామెంట్స్..
ABN, Publish Date - Apr 10 , 2024 | 12:04 PM
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. రైతుల వద్దకు కేసీఆర్ పోయి పరామర్శిస్తే తట్టుకోలేక.. రేవంత్ రెడ్డి నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి భాష జుగుప్సా కరంగా ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు.
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ( CM Revanth Reddy) బీఆర్ఎస్ నేత (BRS), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కామెంట్స్ (Comments) చేశారు. రైతుల వద్దకు కేసీఆర్ (KCR) పోయి పరామర్శిస్తే తట్టుకోలేక.. రేవంత్ రెడ్డి నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి భాష జుగుప్సా కరంగా ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. బుధవారం, పఠాన్ చెరు మండలం, రుద్రారంలోని, సిద్ది గణపతి దేవాలయ, ఆవరణలో బీఆర్ఎస్ మెదక్ లోక్ సభ (Medak Lok Sabha) ఎన్నికల ప్రచార రథాలను హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను మాయచేస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లోకల్ కాదంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన తెల్లాపూర్‌లోనే ఉంటున్నారని, అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు ఓటేయాలని సూచించారు.
పార్లమెంట్‌లో మన సమస్యలపై గళం విప్పే వాళ్లు కావాలా?.. గులాం గిరి చేసే వారు కావాలో? ప్రజలు నిర్ణయించుకోవాలని హరీష్ రావు అన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్‌లో ఎగురుతోందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో.. అంతగా తుస్సుమనిపించిందన్నారు. వందరోజుల్లో హమీలు నెరవేరుస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఎలాంటి హమీలు నెరవేరలేదని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే పేద మహిళలకు ఫించన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీపడ్డారన్నారు. నిరుద్యోగ భృతి, పేద మహిళలకు ఫించన్లు ఇచ్చిన తరువాతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆడగాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు, రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
Updated Date - Apr 10 , 2024 | 12:09 PM