ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harish Rao: కాంగ్రెస్ ఏ హామీను నెరవేర్చడం లేదు

ABN, Publish Date - Feb 11 , 2024 | 06:42 PM

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను అమలు చేయకుండా మరిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.

సిద్దిపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను అమలు చేయకుండా మరిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ఆదివారం నాడు సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఇవ్వడం లేదని మండిపడ్డారు. మన కేసీఆర్ పేదింటి ఆడపచుల పెళ్లిలకు ఆదుకోవాలని కల్యాణ లక్ష్మీ పథకం తెచ్చారని చెప్పారు. కల్యాణ లక్ష్మీ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదన్నారు. నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం దేవుడెరుగు, ఇచ్చే రెండు వేల కూడా పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. రెండు నెలల పెన్షన్ పెండింగ్‌లో ఉందన్నారు. 24గంటల కరెంట్ ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదన్నారు. కరెంట్ రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని హరీశ్ రావు అన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 06:42 PM

Advertising
Advertising