ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harishrao: ఈ ఓటమి తాత్కాలికమే.. శాశ్వతం కాదు

ABN, Publish Date - Jan 19 , 2024 | 06:48 PM

మెదక్ అసెంబ్లీ సీటును తక్కువ ఓట్లతో కోల్పోయామని.. ఈ ఓటమి తాత్కాలికమేనని.. శాశ్వతం కాదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harishrao ) అన్నారు. తెలంగాణ భవన్‌లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

హైదరాబాద్: మెదక్ అసెంబ్లీ సీటును తక్కువ ఓట్లతో కోల్పోయామని.. ఈ ఓటమి తాత్కాలికమేనని.. శాశ్వతం కాదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harishrao ) అన్నారు. గెలిచినప్పుడు తాము పొంగి పోలేదు ..ఇపుడు కుంగి పోయేది లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) కూడా ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారని చెప్పారు. ఎన్నో అవమానాలు భరించి కూడా కేసీఆర్ నిలబడ్డారని.. అందువల్లే తెలంగాణ సాధించారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు అక్రమ కేసుల బనాయింపుల్లో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులతో బీఆర్ఎస్ ( BRS ) కార్యకర్తలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని.. వారి చేష్టలకు భయపడేది లేదు.. పోలీస్ స్టేషన్లు.. జైళ్లు పోరాటాలు కొత్త కాదని చెప్పారు. రైతుబంధుపై కేసీఆర్‌కున్న చిత్తశుద్ధిని.. ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని హరీష్‌రావు అన్నారు.

గవర్నర్ ఆ బిల్లులను ఆపేవారా..?

కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఆపలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అయితే గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తాము పంపిన బిల్లులు ఆపేవారా....? నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లు పంపితే తిరస్కరించేవారా....? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రెండు ఎమ్మెల్సీల నోటిఫికేషన్లకు వేర్వేరుగా పోలింగ్ జరిగేటట్టు చూశారని మండిపడ్డారు. అదానీ, ప్రధాని మోదీ ఒక్కటని రేవంత్‌రెడ్డి ఆరోపించారని.. మరి ఇప్పుడు ఆయనతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాడని నిలదీశారు. మంత్రి ఉత్తమ్ గతంలో దావోస్ పర్యటనలు దండగ అన్నారని.. మరి రేవంత్ టూర్‌పై ఏమంటారు..? అని నిలదీశారు. ఆరోగ్య శ్రీ కింద పది లక్షల వైద్య సాయం అన్నారని.. అది ఆమలు చేయడం లేదన్నారు. వాస్తవాలను త్వరలోనే బయటకు తెస్తానని చెప్పారు. మెదక్ పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో బీజేపీకి నాయకత్వం లేదన్నారు. కొందరు బీఆర్ఎస్ నుంచి అధికారం కోసం కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని చెప్పారు. వారు పోతే.. చెత్త పార్టీ నుంచి వెళ్లిపోతోందని భావిద్దామన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఇకపై సమర్ధవంతగా తిప్పికొడతామని హరీష్‌రావు హెచ్చరించారు.

Updated Date - Jan 19 , 2024 | 07:01 PM

Advertising
Advertising