Share News

kondapaka: శ్రీసత్యసాయి ప్రశాంతినికేతనంలో వనమహోత్సవం.. పాల్గొన్న హీరో సుమన్

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:07 PM

ఉమ్మడి మెదక్ జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో సుమన్ హాజరయ్యారు.

kondapaka: శ్రీసత్యసాయి ప్రశాంతినికేతనంలో వనమహోత్సవం.. పాల్గొన్న హీరో సుమన్

మెదక్, జులై 16: ఉమ్మడి మెదక్ జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో హీరో సుమన్ మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో, ఉపాధ్యాయులతో కలిసి ఆయన పాఠశాల పరిసరాలను వీక్షించారు. పచ్చని పంట పొలాల్లో.. ప్రశాంత వాతావరణంలో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి వాతావరణంలో విద్యాలయం ఏర్పాటు చేయడం విద్యార్థులకు ఓ వరమన్నారు.

Also Read: Chandrababu Govt: జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

పేద పిల్లలకు సమున్నత విద్యను అందిస్తూ వారి బాగోగుల్ని చూసుకుంటున్న ట్రస్టు సేవల్ని ఈ సందర్బంగా ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని హీరో సుమన్ స్పష్టం చేశారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ పూర్ణిమా శంకర్‌, సెక్రటరీ శంకర్, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయి బాబా.. The End of The Education is Character అంటూ ప్రవచించిన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే ఈ పాఠశాల నడుస్తుందని పాఠశాల నిర్వాహకులు స్పష్టం చేశారు.

Also Read:Notices To Ex MPs: 200 మందికి పైగా మాజీ ఎంపీలకు నోటీసులు

Also Read:Doda encounter: ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Also Read: justice narasimha reddy: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం


Also Read: Doda encounter: దోడా ఘటన.. తమ పనే: కశ్మీర్ టైగర్స్ ప్రకటన

ఇక్కడ చదువు మాత్రమే కాదు... ఇక్కడ చేరే విద్యార్థికి సంబంధించి పూర్తి బాధ్యత ఈ సంస్థదేనని నిర్వాహకులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద అమ్మాయిలతో పాటు... భవిష్యత్ భారతానికి సేవ చెయ్యాలన్న సదుద్దేశ్యంతో వచ్చే పిల్లలకు అత్యుత్తమ విద్యను ఉచితంగా అందించాలన్న ధ్యేయంతో ఈ పాఠశాలను స్థాపించారు. 2017లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొండపాకలో ఈ పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ చేరే విద్యార్థులకు చదువుతో పాటు వసతి, ఇతర అన్ని అవసరాలను ట్రస్టే సమకూరుస్తుంది. పూర్తిగా గురుకుల పద్ధతిలో ఈ పాఠశాల నడుస్తుంది.

Also Read: Narayan Gangaram Surve House: ఎల్‌ఈడీ టీవీ చోరీ చేశాడు.. మళ్లీ తిరిగి ఇంట్లో పెట్టేశాడు.. ఎందుకంటే..?

ఈ పాఠశాలలో చేరే విద్యార్థులు చదువుపై తప్ప మరే ఇతర అవసరాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా నిర్వహాకులు తగిన చర్యలు తీసుకున్నారు. అందుకే హాస్టల్లో చేరే విద్యార్థి కేవలం ఒక్క జత దుస్తులతో వస్తే చాలు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పాఠశాలలో చదువు పూర్తి చెయ్యవచ్చని కొండపాకలోని శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం నిర్వహకులు స్పష్టం చేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 07:12 PM