Share News

BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:53 PM

BRS MLA: రేవంత్ రెడ్డి సర్కార్‌పై అన్ని వర్గాల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు.

BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
MLA Kotha prabhakar Reddy

సిద్దిపేట, ఏప్రిల్ 15: రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ తాను ఎక్కడా చెప్పలేదని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఆయా వర్గాల వారు తమ దృష్టికి తెచ్చిన అంశాలను తమ కార్యకర్తల సమావేశం లో మాట్లాడుకున్నామని ఆయన వివరించారు. మంగళవారం సిద్దిపేటలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..ఏబీఆర్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా అన్ని రంగాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని.. దాని ఫలితమే ప్రభుత్వంపై ఈ అసంతృప్తి అని ఆయన అభివర్ణించారు. అయితే తాను బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మనే.. తానే కాదు పార్టీలోని శ్రేణులంతా కేసీఆర్ ఆత్మేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని తమ పార్టీ అధినేత కేసిఅరే ఆకాంక్షించారన్నారు. ఎందుకంటే.. వారిపై వచ్చే వ్యతిరేకత మరో పదిహేను, ఇరవై ఏళ్ళు వరకు బిఆర్ఎస్ ఆధికారానికి ఉండడానికి ఎటువంటి ఢోకా ఉండదని తమ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పారని వివరించారు. తమ బాస్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఐదేళ్లు పాలించాలని కోరుకుంటే తాము మాత్రం కూలుస్తామని ఎందుకంటామని ఆయన ఎదురు ప్రశ్నించారు. గజ్వేల్ ఇంచార్జ్‌గా తాను ఏడేళ్లు ఉన్నాను.. దీంతో ఆ సమయంలో సీఎం కేసీఆర్ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామని వివరించారు.


రాష్ట్రంలో భూ అక్రమాలపై ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వం మిది.. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రి పొంగులేటి సహా, అందరు మంత్రుల అవినీతిని వెలికితీయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తాం.. కృతజ్ఞతలు చెబుతాం.. మాకు నిధులు ఇవ్వకుంటే మాత్రం నిలదీస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మల్లన్నసాగర్ నిర్మాణానికి త్యాగం చేసింది తమ దుబ్బాక నియోజకవర్గ ప్రజలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

14 గ్రామాలు నిండా మునిగాయని.. తమకు నెత్ తిమీద నీళ్ళ కుండా ఉన్నా తాగు, సాగు నీళ్ళు మాత్రం రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి కాలువలు తవ్వుకుని వేరే ప్రాంతాలకు, జిల్లాలకు నీరు తీసుకుంటుంటే తాము మాత్రం చేతులు ముడుచుకొని కూర్చుంటామా ? అని ప్రశ్నించారు. అభివృద్ధి నిధులు బడ్జెట్ సమయంలోనే ప్రతి నియోజకవర్గానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో తమ లాంటి ఎమ్మెల్యేలమంతా నిలదీస్తామని స్పష్టం చేశారు.


దుబ్బాక ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొంగులేటి..

మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్‌ను కూల్చి వేస్తామంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం స్పందిస్తూ.. అధికార దాహంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి అంటే కేసీఆర్‌ ఆత్మ అంటూ ఆరోపించారు. కేసీఆర్‌ మాటలనే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌తో భూములను అక్రమంగా దోచుకుని.. వారి అనుయాయులకు కట్టబెట్టారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. అక్రమంగా దోచుకున్న భూములను తమ ప్రభుత్వం.. వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు.


కేసీఆర్ ప్రభుత్వంలో అక్రమ సంపాదనతో లాభపడ్డ నేతలే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనాలని వారు చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని వారికి వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారికి సంకెళ్లు వేసి తీరుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఎంతమందిని కొంటారో కొనాలంటూ వారికి సవాల్ విసిరారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చి ఆ కుర్చీలో కూర్చోవాలని.. తండ్రీ, కొడుకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


ఇంతకీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..

దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పుకొచ్చారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని.. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త

Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..

PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ

For Telangana News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 05:54 PM