ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

ABN, Publish Date - Oct 13 , 2024 | 08:04 AM

తాను ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి ఆయన కోటాలోనే తన భార్య నిర్మలకు పదవిచ్చారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని, అదిరేటొడు.. బెదిరేటోడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని అన్నారు. ప్రాణికి చావుంది కానీ పైసాకు చావు లేదు

సంగారెడ్డి: కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Working President Jaggareddy) శనివారం దసరా వేడుకల్లో కామెంట్స్ (Comments) చేశారు. ఓటమి అనేక పాటలు నేర్పిస్తుందని, తాను ఓడిపోయినా.. తన భార్యకు కార్పొరేషన్ పదవి (Corporation post) వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలిచి ఆయన కోటాలోనే తన భార్య నిర్మలకు పదవిచ్చారన్నారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డి (Sangareddy)లో కార్యక్రమాలు చేస్తానని అన్నారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని, అదిరేటొడు.. బెదిరేటోడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని అన్నారు.


1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ఎస్పీ కృష్ణంరాజు తన మనుషులను కొట్టారని.. దీంతో ఆయన కారును ఢీ కొట్టానని, ఆ తర్వాత పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ చేశానని జగ్గారెడ్డి చెప్పారు. 3 వేల మందితో పోలీస్ స్టేషన్ ముట్టడించానని.. ఎంత తోపులం అయినా సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదని అన్నారు. ప్రాణికి చావుంది కానీ పైసాకు చావు లేదని... వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మల గానీ.. ఆంజనేయులు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.


కాగా రుణమాఫీ అంశంపై ఇటీవల అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) చెబుతుండగా.. రుణమాఫీతో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పించింది. ఈ అంశంపై ప్రతీరోజు ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతూనే ఉన్నారు. అయితే రుణమాఫీ అంశంపై జగ్గారెడ్డి స్పందించారు. రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు. రుణమాఫీపై రైతులతో చర్చ చేద్దామని.. ఎల్లిగాడు, మల్లిగాడు కాకుండా కేసీఆర్ చర్చకు రావాలన్నారు.

‘‘సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి చర్చకు నేను తీసుకువస్తాను.. కేసీఆర్‌ను ఒప్పించి తీసుకువచ్చే కెపాసిటీ హరీష్‌కు ఉందా. అక్కడ, ఇక్కడ భయమైతే సిద్దిపేటలోనే చర్చ పెట్టు. మేం పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యాం. బీఆర్ఎస్ పార్టీ పబ్లిసిటీ దగ్గర పాస్ అయింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని మేమే చెప్తున్నాం. హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాళా తీశారు. కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో 8 కిస్తిల్లో లక్ష రుణమాఫీ చేయలేకపోయారు. రుణమాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని అధికారులకు సీఎం ఆదేశించారు’’ అని జగ్గారెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బన్నీ ఉత్సవంలో 50 మందికి పైగా గాయాలు..

సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ట్వీట్..

రావణదహనానికి విల్లుపట్టిన ముర్ము, మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 13 , 2024 | 08:21 AM