ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: జైలులో ఉన్న లగచర్ల గ్రామ రైతులను పరామర్శించనున్న కేటీఆర్

ABN, Publish Date - Nov 15 , 2024 | 08:24 AM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డికి బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలసి 11 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. జైలులో ఉన్న లఘుచర్ల గ్రామ రైతులను కేటీఆర్ బృందం పరామర్శించనుంది.

సంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాకు (Sangareddy District) వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డికి బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలసి 11 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. జైలులో ఉన్న లగచర్ల గ్రామ రైతులను కేటీఆర్ బృందం పరామర్శించనుంది.


కాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధజమెత్తారు. ‘‘11నెలల నుంచీ ఈ ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చికాల మాటలు. చెవులు కొరకడమే. నేను డ్రగ్స్‌ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్‌ చేయలేదు, అవినీతి అంతకన్నాచేయలేదు. గతంలో మోదీని ఉద్దేశించి.. మోడీయా.. బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను. నా నిజాయతీకి ఉన్న ధైర్యంతో ఇప్పుడు రేవంత్‌రెడ్డికీ అదే చెబుతున్నా.. చిట్టినాయుడూ ఏం పీక్కుంటావో.. పీక్కో’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అసలు కేసులు పెట్టాల్సింది తమ పార్టీ నేత నరేందర్‌రెడ్డిపైన, తనపైన కాదని, కేసులు పెట్టాల్సింది ఎనుముల బ్రదర్స్‌పైన అని చెప్పారు. లగచర్ల రైతులు రేవంత్‌రెడ్డి చేసిన పనులకు ఆయన భాషలోనే సమాధానం చెప్పారన్నారు. రేవంత్‌ జైలుకెళ్లారు కాబట్టి తననూ ఏదోలా పంపాలని అనుకుంటున్నారని ఆరోపించారు. లగచర్ల కేసులో ఆధారాలుంటే కోర్టులో పెట్టాలని సవాల్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ నుంచి తాజాగా లగచర్ల కేసు వరకు వరుస ఆరోపణలు.. కొనసాగుతున్న విచారణలు.. అరెస్టు చేస్తారన్న ప్రచారాల నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’కి కేటీఆర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘వదంతులు, గాసిప్స్‌, చెవి కొరకడాలు, ఇచ్చికాల మాటలు వీటిమీదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 11నెలలుగా టైమ్‌పాస్‌ చేసింది. పేదలు, ప్రజలికిచ్చిన హామీలు నెరవేర్చిన పాపాన మాత్రం పోలేదు. అతనో విఫల ముఖ్యమంత్రి. మొదట కాళేశ్వరంలో అవినీతి అన్నారు. తర్వాత విద్యుత్తు రంగంలో ఏదో జరిగిందన్నారు. ఆ తర్వాత ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం తెరపైకి తెచ్చారు. ఫార్ములా వన్‌ అన్నారు. మా బావమరిది ఇంట్లో డ్రగ్స్ పార్టీ అన్నారు. ఇప్పుడు లగచర్ల దాడి అంటున్నారు. ఆయన జైలుకెళ్లారు కాబట్టి నన్నూ ఏదోలా పంపాలని అనుకుంటున్నారు. లగచర్ల కేసులో ఆధారాలుంటే కోర్టులో పెట్టమనండి. అసలు అక్కడ జరిగిందేంటి.. పేద, గిరిజన రైతుల భూములు ప్రభుత్వం లాక్కుంటానంటే వారు తిరగబడ్డారు. 9 నెలల తర్వాత సహనం నశించడంతో అక్కడికి వెళ్లిన అధికారులను నిలదీశారు. కలెక్టర్‌ నామీద దాడి జరగలేదు అని రికార్డెడ్‌గా చెప్పారు. ఆయన జిల్లా మెజిస్ట్రేట్‌. ఆయన చెప్పింది సరైందా.. లేకుంటే రేవంత్‌ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు చెప్పింది సరైందా.. గతంలో ఏపీలో ఇలానే చేసిన ఐపీఎస్‌ అధికారుల పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్న కొందరు పోలీస్‌ అధికారులకూ అదే గతి పడుతుంది’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..

ఏపీపీఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 15 , 2024 | 08:24 AM