ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harish Rao: వ్యూస్ కోసం నా క్రెడిబులిటీ దెబ్బతీస్తారా?

ABN, Publish Date - Jun 17 , 2024 | 01:30 PM

నీట్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ హయాంలో విద్య కొందరి చేతుల్లోకి వెళుతోందన్నారు. వైద్య విద్య అంగట్లో సరుకైందన్నారు. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కులపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. నీట్ పైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: నీట్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ హయాంలో విద్య కొందరి చేతుల్లోకి వెళుతోందన్నారు. వైద్య విద్య అంగట్లో సరుకైందన్నారు. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కులపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. నీట్ పైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 67మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు. ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు ఫుల్ మార్కులు వచ్చాయని తెలిపారు. నీట్‌లో గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదన్నారు. 1763మందికి ఎలా గ్రేస్ మార్కులు కలిపారని ప్రశ్నించారు. ఎవరికి గ్రేస్ మార్కులు కలిపారో బయట పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


‘‘నీట్ ఫలితాలను పది రోజులు ముందుకు జరిపి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ రోజే ఎందుకు విడుదల చేశారు? ఇప్పటి వరకూ కేంద్రం దీనిపై విచారణ ఎందుకు జరపడం లేదు? 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన అంశంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎన్టీఏ ఎందుకు స్పందించడం లేదు. పేపర్ లీక్ అవ్వకపోతే గుజరాత్, బీహార్‌లో అరెస్ట్‌లు ఎందుకు జరిగాయి? కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనిపై స్పందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. సోషల్ మీడియా నా క్రిడిబులిటీ దెబ్బతీసేలా థంబ్ నెయిల్ పెడుతున్నారు. నేను బీజేపీలోకి వెళుతున్నానని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతున్నానని ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారికి లీగల్ నోటీస్‌లు పంపిస్తా. సోషల్ మీడియా వాళ్ల వ్యూస్ కోసం నా క్రెడిబులిటీ దెబ్బతీయడం సరికాదు’’ అని హరీష్ రావు అన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 01:30 PM

Advertising
Advertising