ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodar Rajanarsimha: మూసీపై రాజకీయాలొద్దు

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:33 AM

మూసీని ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని, మూసీని కాపాడుకునే చిత్తశుద్ధి, కమిట్‌మెంట్‌ ప్రభుత్వానికి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

  • నాడు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నేడు రాజకీయం చేస్తారా?

  • బీఆర్‌ఎస్‌ అబద్ధాలు మానుకోవాలి మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మూసీని ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని, మూసీని కాపాడుకునే చిత్తశుద్ధి, కమిట్‌మెంట్‌ ప్రభుత్వానికి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, చెరువులు, నదులను కాపాడే బాధ్యత మనందరిపై ఉండాలని పేర్కొన్నారు. 2016లో మూసీ రివర్‌ డెవల్‌పమెంట్‌ బోర్డ్‌ను జీవో నంబరు7 ద్వారా అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిందని, మూసీ రివర్‌ బౌండరీ్‌సను గత ప్రభుత్వమే నిర్ణయించిందని చెప్పారు. మూసీ ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని గత సర్కారే నిర్ణయించిందన్నారు.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే మునిసిపల్‌శాఖ తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, దానికి డైరెక్షన్‌ మినిట్స్‌ కూడా ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు దాన్నే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ పక్కన జీవించే ఏ ఒక్క పేదవాడికి అ న్యాయం జరగదని, ఇది సీఎం రేవంత్‌ రెడ్డి గ్యారెంటీ అని పేర్కొన్నారు. మూసీని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, రాత్రికిరాత్రే అభివృద్ధి సాధ్యంకాదనేది గుర్తుంచుకోవాలన్నారు. మూసీ నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగనివ్వబోమని హామీ ఇచ్చిన ఆయన పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఆ దిశగా సీఎం రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు.


బీఆర్‌ఎస్‌ హయాంలో 14 గ్రామాలు మల్లన్న సాగర్‌లో మునిగిపోయాయని, భూ నిర్వాసితులకు నాడు ఏం న్యాయం చేశారని దామోదర ప్ర శ్నించారు. పోలీసుల జులుం.. లాఠీ చార్జీలు, 144సెక్షన్‌ విధించినదీ గుర్తుంచుకోవాలన్నారు. వారు తెచ్చిన రెండు భూసేకరణ చట్టాలను కోర్టు కొట్టివేసిందన్నారు. యూపీఏ సర్కారు 2013లో సమగ్ర భూసేకరణ చట్టం తెస్తే దాన్ని అమలు చేయలేదని విమర్శించారు. జీవో నంబర్‌ 123 తెస్తే.. ప్రజలు మీపై తిరుగుబాటు చేశారని, కోర్టుకు వెళ్లి ఆ జీవోను రద్దు చేయించుకున్నారన్నారు. రాజకీయమంటే గాలి మాట లు, అబద్ధపు ఆరోపణలు కాదని, ఇకనైనా అబద్ధాలు మానుకోవాలని బీఆర్‌ఎ్‌సకు హితవు పలికారు. తొమ్మిదిన్నరేళ్లలో రియల్‌ఎస్టేట్‌ ఎలా సాగిందీ.. కా ర్పొరేషన ్ల ఏర్పాటుతో రుణాలు ఎలా తీసుకున్నదీ తమకు తెలుసని దామోదర అన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 04:33 AM