ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medak: గిరిజన విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి చేయూత

ABN, Publish Date - Oct 31 , 2024 | 04:55 AM

ఎంబీబీఎస్‌ సీటు సాధించినా ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోతున్న ఓ గిరిజన విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేయూతనందించారు.

కౌడిపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) 30: ఎంబీబీఎస్‌ సీటు సాధించినా ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోతున్న ఓ గిరిజన విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేయూతనందించారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్‌ భద్యతండాకు చెందిన కాట్రోత్‌ శివ రాం, గంసీలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు కాట్రోత్‌ సుమలత సిద్దిపేటలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. కానీ డబ్బులేక కూలీ పనులకు వెళ్తోంది.


ఈ విషయం సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. బుధవారం సుమలత కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి మంత్రి కార్యాలయానికి పిలిపించి ఆమెకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేశారు. వైద్య విద్య పూర్తి అయ్యే వరకు తనదే బాధ్యత అని మంత్రి తెలిపారు.

Updated Date - Oct 31 , 2024 | 04:55 AM