ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

ABN, Publish Date - Oct 03 , 2024 | 08:49 PM

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మరోసారి బాంబు పేల్చారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడారన్నారు.

హైదరాబాద్, అక్టోబర్ 03: తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మరోసారి బాంబు పేల్చారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడారన్నారు. అయితే ఇప్పటి వరకు నాగ చైతన్య, సమంతకు విడాకుల విషయమై.. బయట ప్రపంచానికి నిజాలు ఏమిటో తెలియదన్నారు. టాలీవుడ్ నుంచి తనకు అంతర్గతంగా వచ్చిన విషయాన్నే చెప్పానన్నారు. నేటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌తో సహా తెలంగాణలో తిరగడని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

Also Read: Konda Surekha: కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు


హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లపై ఆమె తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యాలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో... సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లోని అగ్ర హీరోలు సైతం వెంటనే ఆ వ్యాఖ్యలపై స్పందించారు.

Also Read: Pawan kalyan: మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామి వారే చెబుతారు


కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వారంతా ఖండించారు. ఇక బీఆర్ఎస్ నేతలు సైతం కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. అలాగే ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ సైతం చేశారు. దీంతో కొండా సురేఖ గురువారం మీడియా ముందుకు వచ్చి స్పందించారు.

Also Read: Pawan Kalyan: సనాతన ధర్మంపై దాడి చేస్తే.. సత్తా చూపిస్తాం


తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గదేలేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కొండా సురేఖపై జీహెచ్ఎంసీలోని బీఆర్ఎస్ ఫిర్యాదు చేశారు.

Also Read: Dasara Navaratri 2024: రేపు శుక్రవారం.. విశేషమేమంటే..


ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు.

Also Read: Dasara NavaRatri 2024: ఈ సమయంలో ఏమి తినాలి.. ఏం తినకూడదంటే.. ?


ఇంకోవైపు మంత్రి కొండ సురేఖ తమ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిందంటూ.. నాంపల్లి కోర్టులో హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోయిన్లు సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 08:36 AM