ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam prabhakar: హైదరాబాద్‌ అభివృద్ధికి మీరేం చేశారు?

ABN, Publish Date - Jul 12 , 2024 | 04:12 AM

సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో హైదరాబాద్‌ అనాథలా మారిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • కిషన్‌రెడ్డిపై పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం

  • కేటీఆర్‌ వల్లే భూకబ్జాలని మండిపాటు

హైదరాబాద్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో హైదరాబాద్‌ అనాథలా మారిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి బీజేపీ, కిషన్‌ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కారుతో అంటకాగి, కేంద్రం నుంచి సాయం అందించకుండా నిర్లక్ష్యం చేసిన కిషన్‌ రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఎంపీగా, పర్యాటక శాఖ మంత్రిగా హైదరాబాద్‌ అభివృద్ధికి కిషన్‌ రెడ్డి ఎలాంటి పథకాలు మంజూరు చేయలేదని ఆరోపించారు.


హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీ చేయలేదని, అమృత్‌ పథకం నుంచి ఒక్క రూపాయి తేలేదని మండిపడ్డారు. బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకురాలేకపోయిన కేటీఆర్‌ హైదరాబాద్‌ కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా ఉందని పొన్నం విమర్శించారు. హైదారాబాద్‌లో భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు కేటీఆరే కారణమని మంత్రి పొన్నం ఆరోపించారు.

Updated Date - Jul 12 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<