Ponnam Prabhakar: గురుకులాల్లో ఆహార కమిటీల ఏర్పాటు: పొన్నం
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:11 AM
గురుకులాల్లో ఆహార కల్తీ ఘటనలకు ఆస్కారం లేకుండా ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను అధికారులకు అప్పగించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): గురుకులాల్లో ఆహార కల్తీ ఘటనలకు ఆస్కారం లేకుండా ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను అధికారులకు అప్పగించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మండలిలో పొన్నం మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు రాజకీయ విమర్శలుచేయడం మానేసి.. ఆయా ప్రాంతాల్లోని గురుకులాలను సందర్శించాలని సూచించారు. రాష్ట్రంలో 327 బీసీ గురుకులాలు ఉంటే కేవలం 21 గురుకులాలకే సొంత భవనాలు ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా గురుకులాలను ప్రారంభించినా.. భవనాలు నిర్మించలేదని విమర్శించారు. తాము సమస్యల పరిష్కరిస్తున్నామని తెలిపారు.
Updated Date - Dec 20 , 2024 | 05:11 AM