Hanmakonda: అమరులు కలగన్న పాలన మొదలైంది..
ABN, Publish Date - Jun 04 , 2024 | 05:05 AM
అమరులు, ఉద్యమకారుల ఆశయాలు ఫలించే పాలన రాష్ట్రంలో ఆరంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛాయుత పాలన అమల్లోకి వచ్చిందన్నారు. సోమవారం హనుమకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు.
ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు.. 250 గజాల ఇళ్ల స్థలాలు ఇస్తాం: పొన్నం
ప్రజల ఆకాంక్షను నెరవేర్చేది రేవంతే: సీతక్క
కేసీఆర్ నిరంకుశ పాలన ముగిసింది: కోదండరాం
హనుమకొండ సిటీ, జూన్ 3 : అమరులు, ఉద్యమకారుల ఆశయాలు ఫలించే పాలన రాష్ట్రంలో ఆరంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛాయుత పాలన అమల్లోకి వచ్చిందన్నారు. సోమవారం హనుమకొండలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు తెలంగాణ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ, అంజన్ కుమార్, సిరిసిల్ల రాజయ్య, వివేక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేది సీఎం రేవంత్‌రెడ్డేనని మంత్రి సీతక్క అన్నారు. ఉద్యమకారులు, అమరుల ఆశయాలను సాధించడంలో రేవంత్ రాజీపడబోరని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలన ముగియడంతో రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు వీస్తున్నాయని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఉద్యమకారులు, అమరుల కుటుంబాలను సన్మానించడం ద్వారా జన్మ ధన్యమైనట్లు భావిస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Jun 04 , 2024 | 05:05 AM