ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: కార్యకర్తల ధర్నాగా మారిన రైతు ధర్నా

ABN, Publish Date - Aug 22 , 2024 | 09:02 PM

బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. అందుకే బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాల్లో రైతులు ఎవరు పాల్గొన లేదన్నారు. అసలు ప్రతిపక్ష పార్టీ ఉనికి కోసమే ధర్నాలు చేపట్టిందంటూ బిఆర్ఎస్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ చేపట్టిన ధ‌ర్నాల‌కు ప్రజల నుంచి స్పంద‌నే లేదన్నారు. అందుకే ఒక్క రోజు చేసి ఢిల్లీకి ప్ర‌యాణ‌మ‌వుతున్నారని తెలిపారు.

హైదరాబాద్, ఆగస్ట్ 22: అధికారం లేకుండా బీఆర్ఎస్ పెద్దలు ఉండలేక పోతున్నారని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ స్టేట్‌ను వాళ్ల ఎస్టేట్‌గా భావించారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అమలు చేసిన రైతు రుణ మాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్‌లో స్పందించారు.

Also Read: RG Kar Hospital: హత్యాచారం కేసులో సీబీఐ కీలక పురోగతి

ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. అందుకే బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాల్లో రైతులు ఎవరు పాల్గొన లేదన్నారు. అసలు ప్రతిపక్ష పార్టీ ఉనికి కోసమే ధర్నాలు చేపట్టిందంటూ బిఆర్ఎస్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ చేపట్టిన ధ‌ర్నాల‌కు ప్రజల నుంచి స్పంద‌నే లేదన్నారు. అందుకే ఒక్క రోజు చేసి ఢిల్లీకి ప్ర‌యాణ‌మ‌వుతున్నారని తెలిపారు.

Also Read: Hyderabad: ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

Also Read: Beerla Ilaiah: ‘రైతు రుణ మాఫీ చూసి బీఆర్ఎస్ నేతల మతి భ్రమించింది’


తమ ప్రభుత్వం మీద రైతులు విశ్వాసం ఉంచారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ట్రాప్‌లో ఎవరు పడవద్దంటూ ఈ సందర్బంగా రైతులకు మంత్రి పొన్నం సూచించారు. అయినా బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరన్నారు. బీజేపీ, బిఆర్ఎస్‌లు ఒకే ట్యూన్ వినిపిస్తున్నాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Also Read: Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ

Also Read: అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు


2018, డిసెంబర్ 12 నుంచి 2023, డిసెంబర్ 9వ తేదీ తర్వాత తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ కాలేదని మంత్రి పొన్నం సోదాహరణగా వివరించారు. ఇంకా ఎక్కడైనా సాంకేతిక కారణాలు, ఆధార్ కార్డులో పేర్లు తప్పులు లాంటివి ఏమైనా ఉంటే మండల వ్యవసాయాధికారులకు పిర్యాదు చేయవచ్చునని రైతులకు మంత్రి పొన్నం సూచించారు.

Also Read: Hyderabad City: నడి రోడ్డుపై యువకుడి నిర్వాకం.. ఏం చేశాడంటే..?

Also Read: Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’


ధర్నాలు చేసేది ఇక్కడ కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న అదానీ, మోదీలపై చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు మంత్రి పొన్నం సూచించారు. గత ప్ర‌భుత్వ హయాంలో రుణ మాఫీ కాని రైతులు.. బీఆర్ఎస్ నేత‌ల‌ను ప్ర‌శ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా ఏ ముఖం పెట్టుకుని డ్రామాలాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలంటూ రైత‌న్న‌లకు మంత్రి పొన్నం సూచించారు.

Read More Telangana News and atest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 09:15 PM

Advertising
Advertising
<