G. Jagadish Reddy: స్పీకర్.. అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు..
ABN, Publish Date - Jun 27 , 2024 | 05:00 AM
బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రె్‌సలో చేరడం చట్ట వ్యతిరేకమని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే జి.జదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మెయిల్, స్పీడ్ పోస్టులో ఫిర్యాదులు పంపాం
పోచారం, సంజయ్‌ను అనర్హులుగా ప్రకటించాలి
ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పడం సిగ్గుచేటు: జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రె్‌సలో చేరడం చట్ట వ్యతిరేకమని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే జి.జదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేద్దామంటే ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆ ఇద్దరిపై అనర్హత వేటువేయాలని కోరుతూ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి వేర్వేరుగా ఈ మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదులు పంపామన్నారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారిద్దరిపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. పాంచ్‌న్యాయ్‌లో ఫిరాయింపులను ఆమోదించబోమని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చేకుంటోందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో చట్టప్రకారం రెండు వంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని గుర్తు చేశారు. తమ పార్టీలో చేరిన వారంతా కేసీఆర్ వద్దకు వచ్చి కండువాలు కప్పుకొన్నారని, కానీ.. ఇప్పుడు రేవంత్ ఇంటింటికి తిరిగి కండువాలు కప్పడం సిగ్గుచేటన్నారు.
Updated Date - Jun 27 , 2024 | 05:00 AM