ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA: బీజేపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు.. సీఎం రేవంత్‌రెడ్డి భగీరథుడు కాదుగా

ABN, Publish Date - Oct 25 , 2024 | 11:02 AM

మూసీ పునర్జీవం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి భగీరథుడు కాదు.. అనంతగిరి కొండల్లో బాణం వేస్తే నీళ్లు బయటికి వచ్చేది కాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(Kamareddy MLA Venkataramana Reddy) విమర్శించారు.

- మూసీకి పునర్జీవం, నిరుపేదలకు మెరుగైన పునరావాసం కల్పిస్తామని సీఎం మాటివ్వాలి

- అప్పుడే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి

- మూసీ నిర్వాసితుల పరామర్శలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

హైదరాబాద్: మూసీ పునర్జీవం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి భగీరథుడు కాదు.. అనంతగిరి కొండల్లో బాణం వేస్తే నీళ్లు బయటికి వచ్చేది కాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(Kamareddy MLA Venkataramana Reddy) విమర్శించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, నగర మాజీ డిప్యూటీ మేయర్‌ జి.సుభా్‌షచందర్‌జీ, కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మీరెడ్డి, కొత్తకాపు అరుణారెడ్డి, పార్టీ భాగ్యనగర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సందడి సురేందర్‌రెడ్డి, తుమ్మలపల్లి రమే్‌షరెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, నవీన్‌రెడ్డిలతో కలిసి మూసారాంబాగ్‌ బ్రిడ్జి నుంచి శాలివాహననగర్‌ వరకు ఉన్న మూసీ నిర్వాసితులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎల్లమ్మా.. ఈ పనులయ్యేది ఎప్పుడమ్మా?


తాము ఇక్కడే నివాసముంటామని, తాము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లమంటూ పలువురు నిరుపేద కుటుంబీకులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పునర్జీవం చేసేందుకు నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల గుడిసెలు, ఇళ్లను తొలగిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటన బాధాకరమన్నారు. ఒకవేళ మూసీనదిని నిజంగానే పునర్జీవం చేయాలనుకుంటే పునర్జీవం అనే బదులు పునర్‌ నిర్మాణం అనండి నది పరీవాహక ప్రాంతాన్ని కాపాడుతామని చెప్పండి. దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో ముందుగా అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించి తెలియజేయండి.


అనంతరం అధికార యంత్రాంగంతో మూసీ నిర్వాసితులతో అభిప్రాయాలు తీసుకోండి అంతే గానీ ఏకపక్ష నిర్ణయాలతో మూసీ గర్భంలో ఉన్న ఇళ్లను తొలగిస్తాం. కూల్చివేస్తామం టే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బహిరంగంగా ఎవరికి ఎలాంటి నష్టం కలుగకుండా నిర్ణయం తీసుకుంటామని సీఎం మాట ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 40ఏళ్లుగా మూసీ పరీవాహక ప్రాంతంలో జీవనం సాగిస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలను పునరావాసం కోసం ఎక్కడికి తరలిస్తారు. అనేది ప్రజల మధ్యకు వచ్చి తెలియజేయాలి. ప్రజలకు నమ్మకం కలిగించాలి. అందుకు గాను వంద కుటుంబాలకు ఒక అధికారిని నియమించాలి.


ఇక్కడి కుటుంబీకులను ఇప్పుడున్న పరిస్థితికన్నా వందశాతం మెరుగైన పరిస్థితిలో జీవనం పునర్‌నిర్మాణం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంతకన్నా మంచి సదుపాయాలతో పునరావాసం కల్పించాలి. ఈ మాట సీఎం ప్రకటిస్తే అందుకు అన్ని పార్టీలు మద్దతునిస్తాయి. ఇక ఖాళీ చేసిన స్థలాలైన మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయమని కూడా ప్రకటించాలన్నారు. ప్రజలు సేదతీరేలా పచ్చదనంతో తీర్చిదిద్దాలని, సీసీ కాంక్రీట్‌ నిర్మాణం చేయమని ప్రకటిస్తూ సీఎం మాట ఇస్తే అందుకు తాము దేనికంటే దానికి ఒప్పుకుంటామన్నారు.


ప్రైవేటు పరంగా గానీ ఎట్టి పరిస్థితుల్లోను ఆకాశహర్మ్యాలు నిర్మించం. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించం. ఎలాంటి దుర్వినియోగం చేయమని, ఇక్కడ బడా వ్యాపారులకు జాగాలు ఇవ్వమని, ప్రభుత్వం నిధుల కోసం అప్పుల్లో ఉందని వాటిని తీర్చేందుకు డబ్బున్నోడికి అమ్మకాలు చేయమని ప్రకటన చేయాలని కూడా సూచించారు. మూసీ నదికి ఇరువైపులా ప్రహరీ నిర్మించాలి. ఖాళీ స్థలాన్ని సుందరీకరణ పేరుతో గార్డెనింగ్‌ చేయాలి. అంతేగానీ గత సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తీసుకున్న నిర్ణయాల తరహాల్లోనే మూసీ భూములను దారాదత్తం చేస్తారా అని ప్రశ్నించారు. సియోల్‌ పర్యటన ఎందుకు అక్కడకు వెళ్లి ఏం చేస్తారు.


ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావో ఇక్కడ చేయి అంతేగానీ రాజస్థాన్‌కు వెళ్లి బాయి తవ్వుతా అంటే ఇసుకలో అయ్యేదేనా హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)లో ఉన్నట్లు 25డిగ్రీల టెంపరేచర్‌ను తీసుకువస్తానని, తెలంగాణ రాష్ట్రానికి సముద్రాన్ని మళ్లిస్తాననడం అయ్యే పనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఇక కాని పనిని ఎందుకు నెత్తిన ఎత్తుకోవడం అవసరమేముంది. అనవసరంగా రాజకీయంగా మాంత్రికంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సీఎంకు సూచించారు. కమిట్‌మెంట్‌తో ఉంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రాజెక్ట్‌కు అన్నిపార్టీలు సహకరిస్తాయని ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా మూసీ నిర్వాసితులకు బీజేపీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!

ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే

ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ గార్డెన్‌: తుమ్మల

ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2024 | 11:02 AM