ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA: మల్కాజిగిరి ప్రాంతాన్ని రైల్వే నుంచి విముక్తి చేస్తా..

ABN, Publish Date - Jun 27 , 2024 | 11:23 AM

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. స్థానిక కార్పొరేటర్‌ మీనాఉపేందర్‌రెడ్డి, రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు.

- ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి

హైదరాబాద్: నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. స్థానిక కార్పొరేటర్‌ మీనాఉపేందర్‌రెడ్డి, రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్‌కేపురం ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్లైఓవర్‌ బ్రిడ్జి ట్రాఫిక్‌ అవసరాలకు సరిపోవడం లేదన్నారు. దీంతో తరచూ ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మిస్తే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఉండవన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి..


రైల్వే, జీహెచ్‌ఎంసీ(Railway, GHMC) అధికారులు సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి సమాంతర ప్లైఓవర్‌ నిర్మాణ పనులు మొదలయ్యేలా పాటుపడాలని ఆయన కోరారు. ప్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డులోని గుంతలను పరిశీలించి తగిన మరమత్తులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరి ప్రాంతాన్ని రైల్వే నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారి సుధాకర్‌, జీహెచ్‌ఎంసీ ఈఈ రాజు, డీఈ రేణుక, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 11:23 AM

Advertising
Advertising