MLA: మేమిచ్చిన చెక్కులే మీరిస్తున్నారు.. తులం బంగారం ఏదీ..
ABN, Publish Date - Dec 08 , 2024 | 01:53 PM
పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ఒక అన్నగా మాజీ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, నాటి పథకాన్నే ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కొనసాగిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి(Maheshwaram MLA and former minister P. Sabitha Reddy) అన్నారు.
- మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
హైదరాబాద్: పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ఒక అన్నగా మాజీ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, నాటి పథకాన్నే ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కొనసాగిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి(Maheshwaram MLA and former minister P. Sabitha Reddy) అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ‘మేమిచ్చిన చెక్కులే మీరూ ఇస్తున్నారు. ఇందులో కొత్తేం ఉంది.. చేతనైతే, ఆడపిల్లలపై నిజంగా ప్రేమ ఉంటే హామీ ప్రకారం తులం బంగారం కలిపి ఇవ్వండి’ అని ఆమె సవాల్ విసిరారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సమతుల ఆహారం.. థాలీ
శనివారం బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి(Kalyanalakshmi) చెక్కులను ఆయా కార్పొరేషన్లలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా ఎన్ని చెక్కులు ఇచ్చారో వారందరికీ తులం బంగారం ఇవ్వాల్సిందేనని అన్నారు.
చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకోబోమని, దీనిపై ఆడపిల్లలతో కలిసి ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మేయర్లు చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి, దుర్గాదీ్‌పలాల్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రమ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్లు సూర్ణగంటి అర్జున్, అర్కల భూపాల్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Breaking News: మంచు ఫ్యామిలీలో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ మనోజ్
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈవార్తను కూడా చదవండి: JP Nadda: మభ్యపెట్టి.. అధికారంలోకి
ఈవార్తను కూడా చదవండి: Shankar journalist: తెలంగాణ తల్లి విగ్రహంపై అసభ్యకర పోస్టులు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 08 , 2024 | 01:53 PM