Vedma Bojju Patel: బిట్టు తల తెస్తే నా ఆస్తి రాసిస్తా..
ABN, Publish Date - Sep 20 , 2024 | 04:03 AM
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ రాహుల్ ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి
రవ్‌నీత్ బిట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఫైర్
బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతుంటే
కేంద్ర హోం శాఖ ఏం చేస్తోందని ప్రశ్న
ఉట్నూర్, సెప్టెంబరు 19 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రవ్‌నీత్ సింగ్ బిట్టు తల నరికి తెచ్చి ఇచ్చిన వారికి తన ఆస్తి రాసిస్తానంటూ సంచలన వ్యాఖ్య చేశారు. తన తండ్రి సంపాదించిన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసి ఇస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీ దేశంలోనే నెంబర్ వన్ ఉగ్రవాది అంటూ రవ్‌నీత్ సింగ్ బిట్టు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇందుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు రవ్‌నీత్ దిష్టిబొమ్మను గురువారం దహనం చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ బిట్టు తల నరికి తెచ్చినవారికి ఆస్తి ఇస్తానని ప్రకటించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే కేంద్ర హోం శాఖ పట్టించుకోకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. రవ్‌నీత్‌పై బీజేపీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే పని మానుకోవాలని బీఆర్‌ఎస్ నేతలకు హితవు పలికారు.
Updated Date - Sep 20 , 2024 | 04:03 AM