TS News: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
ABN, Publish Date - Mar 28 , 2024 | 08:25 AM
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగనుంది.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల (Local Bodies) కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (MLC By Poll) పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారులు10 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
AP Elections: ఓటమి భయంతో అబద్ధాలు.. అడ్డంగా దొరికిపోయిన జగన్..!
ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యేలు14, ఎంపీలు 02, ఎమ్మెల్సీలు 03 మొత్తం 19 మంది.. ఇక ఎంపీటీసీ సభ్యులు 888, జడ్పీటీసీ 83, మున్సిపల్ కౌన్సిలర్లు 449.. మొత్తం 1439 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా,, మహబూబ్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ ఓవర్ యాక్షన్‌తో మీడియా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పాసులు ఉన్నా మీడియాను పోలింగ్ స్టేషన్ ముందు వరకు కూడా అనుమతించడం లేదు. దీంతో మీడియా ప్రతినిధులంతా ఎన్‌హెచ్167 పైనే నిలబడిపోయారు.
AP News: పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా కారు ప్రమాదం.. ముగ్గురు మహిళల మృతి
కల్వకుర్తి ఎమ్మెల్యే (Kalvakurthy MLA)గా గెలిచిన తర్వాత కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayana Reddy) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడగా.. కాంగ్రెస్ తరఫున మన్నె జీవన్‌రెడ్డి (Manne Jeevan Reddy), బీఆర్‌ఎస్ తరఫున నవీన్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. మరో స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్ కూడా బరిలో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరగనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని దక్కించుకోవడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు.. బీఆర్‌ఎస్ సైతం తమ పార్టీకి ఉన్న బలంతో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని ఆశిస్తోంది. రెండు పార్టీలు ఇప్పటికే తమ ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించాయు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ బలం తక్కువగానే ఉన్నప్పటికీ ఇటీవల పలువురు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు హస్తం కండువా కప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Srisailam: శ్రీశైలం ఆలయంలో సామూహిక అభిషేకాలు రద్దు..
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డి
Updated Date - Mar 28 , 2024 | 08:30 AM