ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Kavitha: కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

ABN, Publish Date - Apr 16 , 2024 | 09:50 AM

మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 23 వరకూ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించే అవకాశం ఉంది. కాగా.. నిన్న కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడారు. దీనిపై కవిత తరుఫు న్యాయవాడి మోహిత్ రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు.

Wine Shops: హైదరాబాద్‌లో 24 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్‌.. కారణమిదే..!?


బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో మోహిత్‌రావును న్యాయమూర్తి ప్రశ్నించగా.. మీడియా అడిగితే మాట్లాడారని తెలిపారు. కవిత ఏం చెప్పాలనుకున్నా.. విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలని న్యాయమూర్తి సూచించారు. అంతేకానీ కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటం వంటివి చేయవద్దన్నారు. ఈ విషయాలను కవితకు వివరించాలని ఆమె లాయర్‌కు న్యాయమూర్తి తెలిపారు. ఒకవేళ మీడియాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కోర్టు బయట మాట్లాడాలని సూచించారు. కోర్టు ఆవరణలో కానీ.. కారిడార్లలో కానీ మాట్లాడవద్దని కవితను న్యాయమూర్తి ఆదేశించారు.

Sriramanavami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 16 , 2024 | 10:51 AM

Advertising
Advertising