MLC Kavitha: రేపటితో కవిత కస్టడీ ముగింపు.. ఇంతలోనే మరో షాక్?
ABN, Publish Date - Jun 20 , 2024 | 07:01 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి (Delhi Liquor Scam) సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరచనున్నారు. అయితే.. కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో.. శుక్రవారం ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ వెలుగు చూడనుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కవిత అరెస్ట్
ఇదిలావుండగా.. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారుల బృందం ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. తొలుత ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అదే రోజు సాయంత్రం 5:20 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆపై ఆమెను తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. అనంతరం ఈ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చి, విచారణ నిమిత్తం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో సీబీఐ సంచలన విషయాలను ప్రస్తావించింది.
ప్రధాన కుట్రదారు
లిక్కర్ కేసులో కవిత ప్రధాన కుట్రదారు సీబీఐ ఆ పిటిషన్‌లో పేర్కొంది. సౌత్ గ్రూప్‌కి గ్రూపునకు చెందిన ఓ మద్యం వ్యాపారి 2021లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిశారని.. తమకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించాలని ఆయన కోరారని తెలిపింది. అలా చేసినందుకు తమ పార్టీకి నిధులు ఇవ్వాలని ఆప్ కోరినట్లు సీబీఐ వివరించింది. ఇదంతా కవిత డైరెక్షన్‌లోనే నడిచినట్లు వెల్లడించింది. ఇలా మరెన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కవిత కస్టడీ ముగియనున్న తరుణంలో.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది.
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jun 20 , 2024 | 07:01 PM