ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Metta Saikumar: బండి సంజయ్‌తో కుమ్మక్కయి కాంగ్రెస్‌ను విమర్శిస్తవా?

ABN, Publish Date - Nov 07 , 2024 | 04:14 AM

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న.. కేంద్ర మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో కుమ్మక్కు అయి.. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ మత్స్య కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆరోపించారు.

  • కాంగ్రెస్‌ మద్దతుతోనే నీకు పదవి వచ్చింది

  • పార్టీలో ఉంటూ.. పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకుంటే చూస్తూ ఊరుకోం

  • ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నపై కాంగ్రెస్‌ బీసీ నేతల ఫైర్‌

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న.. కేంద్ర మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో కుమ్మక్కు అయి.. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ మత్స్య కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆరోపించారు. ఆయన పార్టీని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. తానే బీసీలందరికీ నాయకుడన్నట్లు మాట్లాడుతున్నాడని, వాస్తవానికి ఆయన పెట్టింది కుల మీటింగ్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. జీవో 26తో పాటుగా.. పలు అంశాలపైన కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీన్మార్‌ మల్లన్న బహిరంగ వ్యాఖ్యలు చేయడాన్ని గాంధీభవన్‌ వేదికగా... ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, మెట్టు సాయికుమార్‌ తప్పు పట్టారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోను, ఏబీఎన్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. వారు తీన్మార్‌ మల్లన్నపై ధ్వజమెత్తారు. అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ తానూ బీసీనేనని, తాను రాజ్యసభ సభ్యుడిని అయ్యానంటే అందరు కలిసి ఓటేస్తేనే అయ్యానన్నారు.


కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచి బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు పార్టీ.. ఆయనపై చర్యలు తీసుకుంటుందన్నారు. ఈరవత్రి అనిల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచి.. పార్టీపైనే విమర్శలు చేస్తుంటే ఎన్ని రోజులు చూస్తూ ఊరుకోగలమన్నారు. ‘‘గ్రూప్‌ 1 మెయిన్స్‌కు సంబంధించి జీవో 29తో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ బండి సంజయ్‌, కేటీఆర్‌లతో కలిసి గగ్గోలు పెట్టినవు. పరీక్షలు అయిన తర్వాత టీజీపీఎస్సీ వెల్లడించిన వివరాల ప్రకారం జీవో 29 వల్ల మెయిన్స్‌లో బీసీల పార్టిసిపేషన్‌ 57 శాతంగా తేలింది. అదే జీవో 55 ప్రకారం పరీక్షలు జరిగుంటే బీసీల పార్టిసిపేషన్‌ 39 శాతంగా మాత్రమే ఉండేది. జీవో 29తో బీసీల పార్టిసిపేషన్‌ పెరిగినట్లా? తగ్గినట్లా? మల్లన్న ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరగదా?’’ అని ప్రశ్నించారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బీసీలకు క్షమాపణ చెప్పాలి అని నిలదీశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్లి మాట్లాడవచ్చన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒక్క బీసీ కూడా సీఎం కాలేదన్న బాధ తమకూ ఉందని, సమయం వచ్చినప్పుడు అయి తీరతారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమమే దానికి దారి చూపుతుందన్నారు.


  • రాహుల్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కులగణనకు అంకురార్పణ చేసినందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ వివిధ కార్పొరేషన్ల బీసీ చైర్మన్లు తీర్మానం చేశారు. అలాగే కులగణన సజావుగా సాగేందుకు అన్ని రకాలుగా కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకూ ధన్యవాదాలు తెలిపారు. కులగణనను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలని.. పెరిగిన జనాభాకు తగ్గట్లు వాటా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈరవత్రి అనిల్‌ నేతృత్వంలో గాంధీభవన్‌లో సమావేశమైన బీసీ చైర్మన్లు ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం రాహుల్‌గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Updated Date - Nov 07 , 2024 | 04:14 AM