MLC: హక్కుల సాధనకే యూనియన్ : ఎమ్మెల్సీ కోదండరాం
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:08 AM
కార్మికల హక్కులను సాధించకోవడానికి యూనియన్లు ఎంతో దోహదపడుతాయని ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) అన్నారు. మంగళవారం అల్వాల్ పంజాబ్ కమ్యూనిటీ హాల్‌ల్లో నిర్వహించిన అల్వాల్ సర్కిల్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని, వారికి రావల్సి జీతాన్ని కార్పొరేషన్ ద్వారా అందే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్: కార్మికల హక్కులను సాధించకోవడానికి యూనియన్లు ఎంతో దోహదపడుతాయని ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) అన్నారు. మంగళవారం అల్వాల్ పంజాబ్ కమ్యూనిటీ హాల్‌ల్లో నిర్వహించిన అల్వాల్ సర్కిల్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని, వారికి రావల్సి జీతాన్ని కార్పొరేషన్ ద్వారా అందే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వేతనాలను పెంచాలని అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Diwali 2024: మార్కెట్లకు దీపావళి శోభ..
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు(Outsourced employees) తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం అల్వాల్ సర్కిల్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి పట్లొళ్ళ సురేందర్‌రెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, అల్వాల్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, విజయరామారావుతో పాటు యూనియన్ నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
.....................................................................
ఈ వార్తను కూడా చదవండి:
........................................................................
Hyderabad: సైబర్ మోసానికి యువకుడి బలి
హైదరాబాద్: ఆన్‌లైన్‌లో సైబర్ మోసానికి గురై అధికమొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్(Malkajigiri Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి గౌతంనగర్‌లో కె.వంశీకుమార్(31) జిమ్ నిర్వహిస్తున్నాడు. వంశీకుమార్ తండ్రి వెంకటేశ్వర కుమార్ రైల్వే ఏఎ్‌సఐగా విధులు నిర్వహిస్తున్నాడు. వంశీకుమార్(Vamshikumar) ఇటీవల ఆన్‌లైన్ మోసాలకు గురై అధిక మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు.
తన తండ్రిని సైతం ఫైనాన్సియల్ సఫోర్టుచేయమని అడిగాడు. ఈనెల 27న జిమ్‌కు వెళ్ళిన కుమారునికి వెంకటేష్ కుమార్ ఫోన్‌చేయగా ఫోన్ లిప్టుచేయలేదు. జిమ్‌కు వెళ్లి చూడగా సీలింగ్‌కు వంశీకుమార్ ఉరేసుకుని కనిపించాడు. కిందకు దించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం
ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం
ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్ దాడులను ఎదుర్కొందాం
ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా
Read Latest Telangana News and National News
Updated Date - Oct 30 , 2024 | 11:08 AM