ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:02 AM

జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.

  • జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌కు నో

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. మోహన్‌బాబుకు, ఆయన కుమారుడు మంచు మనోజ్‌కు ఏర్పడిన కుటుంబ వివాదాన్ని కవర్‌ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.


మోహన్‌బాబు తరఫు న్యాయవాది వాదిస్తూ.. మనోజ్‌తోపాటు కొంతమంది అసాంఘిక శక్తులు మోహన్‌బాబు ఇంటి ప్రాంగణంలోకి దూసుకొచ్చారన్నారు. వారు జర్నలిస్టులని తెలియదని, ఇంట్లోకి దూసుకొచ్చిన వారిని అడ్డుకునే ప్రయత్నంలో ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదిస్తూ.. మంచు మనోజ్‌ ఆహ్వానం మేరకు జర్నలిస్టులు అక్కడికి వచ్చారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ముందస్తు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది.

Updated Date - Dec 14 , 2024 | 05:02 AM