ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫాంహౌస్‌ కేసులో విచారణ వేగవంతం

ABN, Publish Date - Oct 30 , 2024 | 05:51 AM

కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఫాంహౌస్‌ ఘటనలో మోకిల పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఫాంహౌస్‌ పార్టీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులు పోలీసుల నోటీసులకు స్పందించి, మంగళవారం స్టేషన్‌కు వచ్చారు.

  • మరో ఐదుగురి వాంగ్మూలం నమోదు

  • రాజ్‌కు హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తి

  • విజయ్‌ ఇంట్లో పోలీసుల సోదాలు

శంకర్‌పల్లి/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఫాంహౌస్‌ ఘటనలో మోకిల పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఫాంహౌస్‌ పార్టీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులు పోలీసుల నోటీసులకు స్పందించి, మంగళవారం స్టేషన్‌కు వచ్చారు. వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి పంపారు. ఇప్పటి వరకు 9 మందిని విచారించినట్లు పోలీసులు తెలిపారు. రోజూ ఐదుగురికి నోటీసులిచ్చి, వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు. త్వరలో వారికీ నోటీసులిచ్చి విచారించనున్నారు. ఫాంహౌస్‌ యజమాని రాజ్‌ పాకాలతో పాటు విజయ్‌ విచారణకు సహకరిస్తారా? లేదా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరూ పోలీసుల విచారణకు సహకరిస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఫాంహౌస్‌ పార్టీలో కొకైన్‌ సేవించి, పట్టుబడిన విజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఆయన భార్య పక్కనే ఉంది. ఆమెకు తెలిసిన ఓ మహిళ మొబైల్‌ను విజయ్‌ తన ఫోన్‌ అని చెప్పి, పోలీసులకు అందజేశారు. విజయ్‌కి ఆదివారం పోలీసులు 41సీఆర్‌పీసీ నోటీసులిచ్చిన తర్వాత స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు.

అయితే జరిగిన విషయాల గురించి విచారించేందుకు సోమవారం రావాలని చెప్పగా.. ఆయన రాలేదు. మంగళవారం పోలీసులు ఫోన్‌ చేయగా స్విచా్‌ఫలో ఉంది. ఇక రాజ్‌ పాకాలకు హైకోర్టు 48గంటల సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారంతో ఆ సమయం ముగిసింది. ఆయన స్టేషన్‌కు వస్తారా? లేదా? వచ్చినా విచారణకు సహకరిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. కాగా, జూబ్లీహిల్స్‌లోని విజయ్‌ ఇంట్లో మంగళవారం నార్సింగ్‌ పోలీసులు సోదాలు చేశారు. ఏసీపీ రమణగౌడ్‌ నేతృత్వంలో పోలీస్‌ బృందాలు మూడు గంటల పాటు తనిఖీలు చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ విజయ్‌ ఫోన్‌ విషయమై సోదాలు జరిపామన్నారు. ఆ సమయంలో విజయ్‌ ఇంట్లో లేరని తెలిపారు.

Updated Date - Oct 30 , 2024 | 05:51 AM