ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

ABN, Publish Date - Oct 30 , 2024 | 04:00 AM

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.

  • మైనర్‌ సహా ముగ్గురి అరెస్ట్‌.. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఘటన

హుస్నాబాద్‌, అక్టోబరు 29: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హుస్నాబాద్‌ ఏసీపీ సతీష్‌ వెల్లడించారు. హుస్నాబాద్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గిరిజన బాలిక ఈ నెల 27న రాత్రి ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌, మరో ఇద్దరు యువకులు బాలికను పట్టణ శివారులోకి బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. కూతురు కనిపించకుండాపోవడంతో కంగారుపడిన బాలిక తల్లి చుట్టుపక్కల వెతికింది. కొన్ని గంటల తర్వాత బాలిక ఇంటికి రాగా... ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించింది. దాంతో బాలిక... భయంతో ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

Updated Date - Oct 30 , 2024 | 04:00 AM