ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Property Tax: నెల నెలా ఆస్తి పన్ను!

ABN, Publish Date - Sep 15 , 2024 | 03:49 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇక నుంచి నెల నెలా ఆస్తి పన్నును వసూలు చేయనున్నారా? ఆరు నెలలకోసారి చెల్లించే విధానానికి స్వస్తి పలకబోతున్నారా?

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో అమలుకు యోచన.. ఆస్తి, నల్లా, విద్యుత్‌ బిల్లుల అనుసంధానం

  • పేమెంట్‌ యాప్‌ల ద్వారా చెల్లింపు సౌకర్యం.. గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇక నుంచి నెల నెలా ఆస్తి పన్నును వసూలు చేయనున్నారా? ఆరు నెలలకోసారి చెల్లించే విధానానికి స్వస్తి పలకబోతున్నారా? విద్యుత్‌, నల్లా బిల్లుల తరహాలో ప్రతి నెలా బకాయిలు చెల్లించేలా మార్పులు తీసుకురానున్నారా? ఆస్తి పన్ను, నల్లా, విద్యుత్‌ బిల్లుల చెల్లింపును ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడంతోపాటు పేమెంట్‌ యాప్‌ల ద్వారా చెల్లించే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారా?.. అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ పని తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే నెలానెలా ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటుతోపాటు 20వేల లీటర్ల కన్నా ఎక్కువ నీటి వాడకానికి సంబంధించిన బిల్లులను సులభంగా చెల్లించే విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. చెత్త సేకరణ చార్జీలను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటును పరిశీలిస్తున్నారు. పేమెంట్‌ యాప్‌ల ద్వారా పన్నులు, చార్జీల వసూలు చేపడితే బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉండదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆరు నెలలకు ఒక సారి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఒక్కో ఇంటికి జలమండలి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తోంది. అంతకు మించి నీటిని వాడే వారి నుంచి బిల్లులు వసూలు చేస్తోంది. నెలల తరబడి బకాయిలు వసూలు కాకపోయినా జీహెచ్‌ఎంసీ సీరియ్‌సగా తీసుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించని వాళ్లూ ఉన్నారు.


కానీ, కరెంట్‌ బిల్లుల చెల్లింపు విషయంలో ఆలస్యమైతే అపరాధ రుసుం వసూలు చేస్తుండడమే కాదు.. మరీ జాప్యం చేస్తే కనెక్షన్‌ కట్‌ చేసేందుకు డిస్కమ్‌లు వెనుకాడడం లేదు. ఇదే పద్ధతిని ఆస్తి పన్ను, నీటి బిల్లుల విషయంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. వీలైతే ఈ మూడు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించేలా, ఒకదానికి మరోటి అనుసంధానం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. పేమెంట్‌ యాప్‌ల ద్వారా చెల్లించే సౌకర్యం ఉన్నందునే ప్రజలు కరెంట్‌ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నారని అధికారులు ప్రస్తావించగా.. ఆ విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఆర్థిక సంవత్సరం చివరలో రాయితీలిచ్చినా సత్ఫలితాలుంటాయని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. పౌర సంస్థల తరఫున సదుపాయాలు, సౌకర్యాలు, సేవలు సక్రమంగా అందినపుడే... ప్రజలు బాధ్యతతో వ్యవహరిస్తారని పేర్కొన్నట్లు సమచారం. సీఎం ఆదేశాలతో అధికారులు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. కాగా, ఎల్‌ఆర్‌ఎస్‌ ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాలో కాకుండా నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 03:49 AM

Advertising
Advertising