Blood Cancer: జూనియర్ ఎన్టీఆర్.. నా బిడ్డను ఆదుకోండి
ABN, Publish Date - Dec 24 , 2024 | 05:15 AM
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ దాతల సాయంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తన కుమారుడు ఇప్పుడు డిశ్చార్చి అయ్యేందుకు దాతలు సహకరించాలని ఓ తల్లి కోరారు.
దాతలూ మాకు సాయం చేయండి
బ్లడ్ క్యాన్సర్ నుంచి కోలుకున్న బిడ్డ డిశ్చార్జి
అయ్యేందుకు సాయం కోసం ఓ తల్లి వేడుకోలు
తిరుపతి (వైద్యం), డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ దాతల సాయంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తన కుమారుడు ఇప్పుడు డిశ్చార్చి అయ్యేందుకు దాతలు సహకరించాలని ఓ తల్లి కోరారు. తన కుమారుడిని అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చిన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆదుకోవాలని ఆమె విన్నవించారు. తిరుపతికి చెందిన కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. ‘బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడ్ని ఏపీ ప్రభుత్వం, టీటీడీ దాతలు ముందుకొచ్చి సాయం అందించడంతో వైద్యం అందింది.
అందుకుగాను దాదాపు రూ.70 లక్షల వరకు ఖర్చయింది. ఇప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేందుకు మరో రూ.20 లక్షలకు పైగా అవసరం ఉందని, ఇందుకు గతంలో తమకు భరోసా ఇచ్చిన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చి సాయం అందించాలని కౌశిక్ తల్లి సర్వసతి కోరారు. అలాగే దాతలు కూడా ముందుకొచ్చి తన బిడ్డను ఆదుకోవాలని ఆమె అభ్యర్థించారు.
Updated Date - Dec 24 , 2024 | 05:15 AM