Kavith Arrest - ED: కవిత అరెస్ట్‌పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 20 , 2024 | 06:52 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ నేత, ఎంపీ అర్వింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ ఈడీకి సహకరించాలని అన్నారు. ఈడీ విచారణకు పిలిస్తే.. హాజరు కాకుండా అనిల్ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
నిజామాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ నేత, ఎంపీ అర్వింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ ఈడీకి సహకరించాలని అన్నారు. ఈడీ విచారణకు పిలిస్తే.. హాజరు కాకుండా అనిల్ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
మెదక్‌లో మాత్రమే బీఆర్ఎస్‌కు డిపాజిట్
బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం లేదని కవిత అరెస్ట్‌తో తేలిపోయిందని అర్వింద్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటు కొనసాగాలని కోరుకుంటున్నానని, ఆరు గ్యారంటీలు అమలు చేశాకనే రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని వీడాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే బీజేపీకి పోటీ అని, రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోతుందని అన్నారు. ఒక్క మెదక్ పార్లమెంట్ సీటులో మాత్రమే బీఆర్ఎస్‌కు డిపాజిట్ దక్కుతుందని అర్వింద్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన బుధవారం మాట్లాడారు. నిజాం ఘగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేపించే బాధ్యత తనదని, అవసరమైతే రైతులకు పేపర్ రాసిస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నెల లోపు నిజాం ఘగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరిపిస్తానని ఆయన వాగ్దానం చేశారు.
Updated Date - Mar 20 , 2024 | 06:55 PM