సీఎం రేవంత్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు
ABN, Publish Date - Dec 26 , 2024 | 04:29 AM
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ కలిశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.
క్రీస్తు బోధించిన శాంతి ఆచరణీయం : మహేశ్‌కుమార్‌గౌడ్
ప్రేమ, త్యాగం, దాతృత్వం, కరుణ కలయికే జీవితమంటూ మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశం ఇచ్చారని, ఆయన బోధించిన శాంతి, సహనం, ఔదార్యం.. ఆచరణీయమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. సత్యపథం వైపు నడిచేలా మానవాళికి ఆయన మార్గ నిర్దేశం చేశారన్నారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Dec 26 , 2024 | 04:30 AM