ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nama Nageswara Rao: రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, Publish Date - Apr 02 , 2024 | 10:51 PM

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎంపీ నామా నాగేశ్వరరావు(MP Nama Nageswara Rao) డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కలెక్టర్ కార్యాలయానికి బీఆర్ఎస్ నాయకులు వచ్చారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఎన్నికల ట్రైనింగ్‌కు వెళ్లారని సిబ్బంది చెప్పటంతో బీఆర్ఎస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswara Rao) డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కలెక్టర్ కార్యాలయానికి బీఆర్ఎస్ (BRS) నాయకులు వచ్చారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఎన్నికల ట్రైనింగ్‌కు వెళ్లారని సిబ్బంది చెప్పటంతో బీఆర్ఎస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడారు. వినతి పత్రం తీసుకునేందుకు వచ్చి వెళ్లాలని కలెక్టర్‌ను ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు.

సానుకూలంగా స్పందించి కార్యాలయానికి కలెక్టర్ వచ్చారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి తమ డిమాండ్లను బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించి త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటామన్నని కలెక్టర్ వీపీ గౌతమ్ హామీ ఇచ్చారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన వారిలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ గాయత్రి రవి, ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నారు.

కలెక్టర్ కు వినతి పత్రం అందించిన తర్వాత ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్న పంటలు అన్ని ఎండిపోయాయని చెప్పారు. పంటలకు ఒక్క తడి నీరు అందిస్తే పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు వినతి పత్రం అందించేందుకు సమయానికి వస్తే కలెక్టర్ సమయానికి రాలేదన్నారు. పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించామన్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో బోర్లు వేయడం మొదలు పెట్టారన్నారు. ఖమ్మం నగరంలో రోజుకి ఒకసారి కరెంట్ పోతుందని చెప్పారు. తాగునీటి సమస్య మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. జిల్లా ప్రజలకు మంచి నీరు అందించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు.

Kadiyam Srihari: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదు: కడియం శ్రీహరి

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎంపీ గాయత్రి రవి

గత నాలుగు రోజులుగా జిల్లాలో తాము పంట పొలాలు పరిశీలించామని రాజ్యసభ సభ్యులు, ఎంపీ గాయత్రి రవి తెలిపారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రజల పక్షాన పోరాడేది తామేనని చెప్పారు. ఎకరాకురూ. 25 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ విషయంలోనే జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశామన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గాయత్రి రవి డిమాండ్ చేశారు.

Big Breaking: కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 10:51 PM

Advertising
Advertising