MP Dayakar: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీలక నేత .. ఏ పార్టీలో చేరారంటే..?
ABN, Publish Date - Mar 16 , 2024 | 07:12 PM
పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS)కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకి ఇప్పటికే కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. బీఆర్ఎస్(BRS) నేతలు ఒక్కక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇదే కోవలో బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ (MP Pasunoori Dayakar) బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి హై కమాండ్‌కు పంపించారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS)కు బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీకి ఇప్పటికే కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. బీఆర్ఎస్(BRS) నేతలు ఒక్కక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇదే కోవలో బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ (MP Pasunoori Dayakar) బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి హై కమాండ్‌కు పంపించారు. శనివారం నాడు ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు. పసునూరికి కండువా కప్పి పార్టీలోకి కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ... గత 23 ఏళ్ల నుంచి ఉద్యమంలో కార్యకర్తగా పని చేశానని తెలిపారు. రాను రాను ఉద్యమంలో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందని.. అందుకే ఆకర్షితుడనయ్యానని చెప్పారు. కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 30 ఏళ్ల నుంచి తనకు మిత్రుడని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని తెలిపారు. బీఆర్ఎస్‌లో 13 ఏళ్ల నుంచి ఉన్నానని చెప్పారు. కేసీఆర్ ఉద్యమంతో సంబంధం లేని కడియం శ్రీహరి కూతురుకు ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వరంగల్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఎంపీగా తనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని అన్నారు. అందరూ ఎంపీలకు ప్రోటోకాల్ ఇచ్చి తనను మాత్రం అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సమాచారం లేకుండా పార్టీ మీటింగ్‌లు పెట్టారని మండిపడ్డారు. తనపై వివక్ష చూపించారని చెప్పారు. వరంగల్‌లో ఏ కార్యక్రమాలకు పోవాలన్న తాను అనుమతి తీసుకోవాలా? అని నిలదీశారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ గల కార్యకర్తగా పనిచేస్తానని పసునూరి దయాకర్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 16 , 2024 | 07:12 PM