ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాయిలర్‌ కోళ్లకు వింత వ్యాధి

ABN, Publish Date - Dec 26 , 2024 | 03:41 AM

రంగారెడ్డి జిల్లా యాచారం, మంచాల మండలాల్లో బాయిలర్‌ కోళ్లు కొన్ని నెలలుగా వింత వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నాయి. ఈ మండలాల్లోని యాచారం, చౌదర్‌పల్లి, కుర్మిద్ద, చిన్నతూండ్ల, మాల్‌, తమ్మలోనిగూడ గ్రామాలలోని కోళ్లఫారాలలో బాయిలర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి.

  • రంగారెడ్డిలోని ఓ రైతు షెడ్డులో ఒక్కరోజే 650 కోళ్ల మృతి

  • నాలుగు నెలలుగా వేలాది కోళ్ల మృత్యువాత

యాచారం/మంచాల, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా యాచారం, మంచాల మండలాల్లో బాయిలర్‌ కోళ్లు కొన్ని నెలలుగా వింత వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నాయి. ఈ మండలాల్లోని యాచారం, చౌదర్‌పల్లి, కుర్మిద్ద, చిన్నతూండ్ల, మాల్‌, తమ్మలోనిగూడ గ్రామాలలోని కోళ్లఫారాలలో బాయిలర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. మంచాలకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి బాయిలర్‌ కోళ్లషెడ్డులో బుధవారం ఒక్కరోజే 650 కోళ్లు మరణించాయి. చౌదర్‌పల్లికి చెందిన జంగయ్య షెడ్డులో నెలక్రితం నాలుగు వేల కోళ్లు చనిపోయాయి. కోళ్లు ఆరోగ్యంగానే కనిసిస్తున్నా ఒక్కసారిగా చనిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.


మామూలుగా వేసవిలో ఎండ తీవ్రతకు కోళ్లు ఎక్కువగా చనిపోతుంటాయి. కానీ చలికాలంలో ఇలా జరగడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యుద్దీపాలతో కోళ్లకు వేడి తగిలే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. వందల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో నిర్వహణ భారం అధికమై అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. కోడిపిల్లలను పంపిణీ చేసే కంపెనీలు తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 03:41 AM