Naga Chaitanya: సిగ్గు.. సిగ్గు.. సురేఖ కామెంట్స్‌పై నాగచైతన్య మండిపాటు
ABN , Publish Date - Oct 03 , 2024 | 07:01 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో అక్కినేని ఫ్యామిలీ, సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండాసురేఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన విడాకుల గురించి మంత్రి ప్రస్తావించడాన్ని హీరో అక్కినేని నాగచైతన్య ఖండించారు.
ఇంటర్నెట్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో అక్కినేని ఫ్యామిలీ, సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండాసురేఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన విడాకుల గురించి మంత్రి ప్రస్తావించడాన్ని హీరో అక్కినేని నాగచైతన్య ఖండించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ‘
‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది నాకు అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే సమంత నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య పేర్కొన్నారు.
Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు
Naga Chaitanya: సిగ్గు.. సిగ్గు.. సురేఖ కామెంట్స్‌పై నాగచైతన్య మండిపాటు
Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే
For Latest News and Telangana News click here