ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjuna Sagar: జలసాగరాలు..

ABN, Publish Date - Sep 03 , 2024 | 03:28 AM

భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఇటు కృష్ణా, అటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది.

  • నాగార్జున సాగర్‌కు 5.41 లక్షల క్యూసెక్కుల వరద

  • శ్రీరాంసాగర్‌కు 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • రెండేళ్ల తర్వాత ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటి విడుదల

  • 15 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. నేడు, రేపు భారీ వర్షాలు?

  • మొత్తం 481 రైళ్లు రద్దు.. 152 దారి మళ్లింపు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఇటు కృష్ణా, అటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్‌కు ఏకంగా 5,41,643 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి 586.80 అడుగులుగా ఉంది. దీంతో సాగర్‌ నుంచి మొత్తం 5,40,503 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జునసాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 3,30,078 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి 884.40 అడుగులుగా ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 4,73,630 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,131 క్యూసెక్కులు, ఎడమ గట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 37,882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


  • ప్రకాశం బ్యారేజీకి రికార్డు వరద..

ఏపీలోని ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరద ముంచెత్తింది. సోమవారం 11,43,201 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మరోవైపు సమీప వాగులు. కీసర, పాలేరు, బుడమేరు నుంచి కూడా భారీగా వరద వస్తోంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు మరో వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నిలకడగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి 5,48,059 క్యూసెక్కులు వరద వస్తుండగా 21 గేట్ల ద్వారా 5,43,617 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి 172.47 అడుగులుగా ఉంది. ఇదిలా ఉండగా.. మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు ఎగువ ప్రాంతాలైన ఆలేరు, బిక్కేరు తదితర ప్రాంతాల నుంచి 7,549 క్యూసెక్కుల నీరు వస్తోంది. రోజంతా గంటగంటకూ ఇన్‌ఫ్లోలో హెచ్చుతగ్గులు ఉండటంతో ఏడు క్రస్టు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 17,600 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి 641.53 అడుగులకు చేరుకుంది. అయితే ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను నిలిపివేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


  • శ్రీరాంసాగర్‌ 41 గేట్ల ఎత్తివేత..

వరుస వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు వరద పోటెత్తుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 3, 14,928 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులో మరో 7టీఎంసీల నీళ్లు ఇంకా తక్కువగా ఉండగానే వరద గేట్లు ఎత్తారు. ప్రాజెక్టుకు మొత్తం 42 గేట్లు ఉండగా.. 41 గేట్ల ద్వారా ఇన్‌ఫ్లోకు సమానమైన నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1088.9 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకుగాను 72.990 టీఎంసీలకు చేరుకుంది.


మరోవైపు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలవిద్యుత్‌ కేంద్రం పూర్తిస్థాయిలో ఉత్పత్తిని మొదలుపెట్టింది. ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో నాలుగు యూనిట్ల ద్వారా అధికారులు 36 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2.92 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2.64 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులోకి 3.72 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో సోమవారం రాత్రి 18 గేట్లను ఎత్తారు.ఇక మేడిగడ్డ బ్యారేజీకి సోమవారం 6.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్లే విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 7.40 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది.


  • నాగార్జునసాగర్‌లో పర్యాటకుల సందడి

నాగార్జునసాగర్‌ జలకళ సంతరించుకోవడం, క్రస్ట్‌ గేట్లు ఎత్తడంతో పర్యాటకుల సందడి నెలకొంది. వరుస సెలవు దినాలు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు కృష్ణమ్మ అందాలను తిలకించడానికి వచ్చారు.

Updated Date - Sep 03 , 2024 | 03:28 AM

Advertising
Advertising