ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagirigutta: గిరిప్రదర్శన వన మహోత్సవం ప్రారంభం..

ABN, Publish Date - Jul 15 , 2024 | 07:29 AM

భువనగిరి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు.

భువనగిరి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) వారి చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ (Giri Pradakshina) చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు. కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్లు కొనసాగే ఈ గిరి ప్రదక్షిణ 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్యతోపాటు కలెక్టర్‌ పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ సమయంలో వ్రత మండపం, సంస్కృత పాఠశాల, అన్నదాన సత్రం, గిరిప్రదక్షిణ రోడ్డుకు ఇరువైపులా, మల్లాపురం వద్ద గోశాల తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.


కాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఆదివారం యాదగిరికొండపై రద్దీ నెలకొంది. ఆషాఢమాసం అయినప్పటికీ వారాంతపు సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వాహనాలపై యాదగిరికొండకు చేరుకున్నారు. సుమారు 30వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంట సమయం, ధర్మదర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ. 45,68,806 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సర్వం స్వాహా!

గుట్ట గిరిప్రదర్శన వన మహోత్సవం ప్రారంభం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 07:52 AM

Advertising
Advertising
<