BRS vs BJP: బీజేపీలోకి ఆయనను తీసుకోవద్దు.. బండి సంజయ్ తీవ్ర వ్యతిరేకత!
ABN, Publish Date - Mar 10 , 2024 | 09:06 PM
Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాదు.. పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections) సమయంలోనూ నేతల కప్పదాట్లు సహజంగా మారిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీకి..
నల్లగొండ, మార్చి 10: అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాదు.. పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections) సమయంలోనూ నేతల కప్పదాట్లు సహజంగా మారిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో(BJP) చేరారు. దాంతో కమలదళంలో జోష్ మరింత పెరిగింది. ఆ జోష్‌లోనే తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చేశారు.
ఇంత వరకు బాగానే ఉంది కానీ.. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ఇవాళ బీజేపీలో చేరిన నలుగురు బీఆర్ఎస్ నేతల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సైది రెడ్డి కూడా ఉన్నాడు. ఆయన చేరికను నల్లగొండ బీజేపీ నేతలే కాకుండా.. పార్టీలోని సీనియర్లు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. సైదిరెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని తేల్చి చెబుతున్నారట. దీనికి కారణం గతంలో ఆయన బీజేపీ నేతలపై జరిపించిన దాడులే అని చెబుతోంది కమలదళం.
బీజేపీ కార్యకర్తలపై సైదిరెడ్డి రెండుసార్లు దాడులు చేయించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గుర్రంపోడు తండా గిరిజన భూముల కబ్జా వ్యవహారంలో బండి సంజయ్‌పైనా దాడి చేశారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. వడ్లు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించేందుకు వెళితే.. రాళ్ల దాడులు చేపించిన సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకోవటం సరైంది కాదంటున్నారు కమలం నేతలు. ముఖ్యంగా సైదిరెడ్డి చేరికను బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సైదిరెడ్డిని పార్టీలోకి చేర్చడాన్ని బండి సంజయ్‌తో పాటు.. పార్టీలోని సీనియర్లు సైతం వ్యతిరేకిస్తున్నారట. మరి ఇప్పటికైతే సైదిరెడ్డి కమలం గూటికి చేరిపోయారు. అక్కడ వాతావరణానికి ఆయన పొసుగుతారా? లేక అక్కడి నేతలు ఆయనకు పొగపెట్టి పంపించేస్తారా? అనేది భవిష్యత్‌లో తేలుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 10 , 2024 | 09:36 PM