ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ లోక్‌అదాలత్‌లో 11.55 లక్షల కేసుల పరిష్కారం

ABN, Publish Date - Dec 15 , 2024 | 05:04 AM

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ విజయవంతమైనట్లు తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్‌.పంచాక్షరి తెలిపారు.

  • రోడ్డు ప్రమాదం కేసులో బాధిత కుటుంబానికి 1.99 కోట్లు

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ విజయవంతమైనట్లు తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్‌.పంచాక్షరి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌ కేసులతోపాటు ప్రీలిటిగేషన్‌ కేసులు మొత్తం కలిపి 11.55 లక్షల కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో రూ. 161 కోట్ల పరిహారం అందజేశారు. హైకోర్టు సహా అన్ని స్థాయిల కోర్టుల్లో మొత్తం 337 స్పెషల్‌ బెంచ్‌లు కేసుల విచారణ చేపట్టాయి. హైకోర్టులో జస్టిస్‌ సూరేపల్లి నంద, రిటైర్డ్‌ జస్టిస్‌ జి.శ్రీదేవి ధర్మాసనాలు 225 కేసులు పరిష్కరించి, దాదాపు రూ. 16 కోట్లు పరిహారం అందజేశాయి.


హైకోర్టులో ఒక మోటార్‌ యాక్సిడెంట్‌ కేసులో బాధిత కుటుంబానికి రూ.1.99 కోట్లు అవార్డు జారీచేశారు. వరంగల్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలకు చెందిన జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యులు చొరవ చూపడంతో నాలుగు జంటలు తమ వైవాహిక వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుని మళ్లీ ఒక్కటయ్యాయి. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ జిల్లా జడ్జీలు, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యులతో వర్చువల్‌గా మాట్లాడి.. జాతీయ లోక్‌అదాలత్‌ ప్రాముఖ్యాన్ని వివరించారు. లోక్‌అదాలత్‌ను విజయవంతం చేసినందుకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే అందరికీ అభినందనలు తెలిపారు.

Updated Date - Dec 15 , 2024 | 05:04 AM