ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NEET Ranks: ర్యాంకు పెరిగినా.. కన్వీనర్‌ కోటా దక్కింది

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:51 AM

నీట్‌ ర్యాంకు లక్షల్లో వచ్చినవారికి రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటాలో సీట్లు దక్కాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు అన్నిట్లోనూ రెండో విడత కౌన్సెలింగ్‌లో ర్యాంకులు పెరిగినా సీటు లభించడం విశేషం.

  • ఉస్మానియా వైద్య కళాశాలలో 1.15 లక్షల ర్యాంక్‌కు సీటు.. ప్రైవేటులో జనరల్‌ విభాగంలో 1.95 లక్షలకు..

  • పూర్తయిన రెండో విడత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): నీట్‌ ర్యాంకు లక్షల్లో వచ్చినవారికి రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటాలో సీట్లు దక్కాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు అన్నిట్లోనూ రెండో విడత కౌన్సెలింగ్‌లో ర్యాంకులు పెరిగినా సీటు లభించడం విశేషం. కన్వీనర్‌ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయింపు ర్యాంకుల వివరాలను సోమవారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. బీసీ ఏలో గరిష్ఠంగా 3.35 లక్షల ర్యాంకు విద్యార్థికి ప్రైవేటు వైద్య కళాశాలలో సీటు లభించింది. ఇంత పెద్ద ర్యాంకుకు సీటు దక్కడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ విభాగంలో 3,.11 లక్షల ర్యాంకు విద్యార్థికి, ఎస్టీల్లో 2.89 లక్షల ర్యాంకర్‌కు కన్వీనర్‌ కోటా సీట్లు వచ్చాయి. బీసీ బిలో 2.27 లక్షలు, బీసీ సిలో 3.14 లక్షలు, బీసీ డిలో 2.13 లక్షలు, బీసీ ఇలో 2.24 లక్షలు, ఓపెన్‌లో 1.95 లక్షలు, ఈడబ్ల్యూఎ్‌సలో గరిష్ఠంగా 1.74 లక్షల ర్యాంకు విద్యార్థికి సీటు దక్కింది.


రాష్ట్రంలో 60 ప్రభుత్వ, ప్రైవేటువైద్య కళాశాలల్లోని 5,653 కన్వీనర్‌ సీట్లను రెండు విడతల కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు కేటాయిస్తూ కాళోజీ విశ్వవిద్యాలయం జాబితా విడుదల చేసింది. తొలి దశలో 4,282 మందికి సీట్లు ఇచ్చారు. అందులో చేరినవారు పోగా మిగిలిన సీట్లకు, తొలి విడత కౌన్సెలింగ్‌లో కేటాయించని దివ్యాంగులు తదితర సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో కేటాయించారు. కన్వీనర్‌ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే ఇస్తుండడం, 8 కొత్త వైద్య కళాశాలల్లో 400 సీట్లు రావడంతో అవకాశాలు పెరిగాయి. దీంతో పెద్ద ర్యాంకులు పొందిన విద్యార్థులకూ సీట్లు దక్కాయి. ప్రభుత్వ కళాశాలల్లో 15 శాతం అఖిల భారత కోటాకు పోగా మిగతావన్నీ, ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. అఖిల భారత కోటాలో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు మిగిలితే వాటిని రాష్ట్రానికే ఇస్తారు. కాగా, రెండో విడత జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు కళాశాలల్లో చేరేందుకు ఆరు రోజుల పాటు అవకాశం కల్పించారు.


తొలి విడత కౌన్సెలింగ్‌తో పోల్చితే రెండో దశలో అఽధిక ర్యాంకులు సాధించినవారికి సీట్లు దక్కాయి. అనేకమంది ఎయిమ్స్‌లలో చేరడమే దీనికి కారణం. ఉస్మానియాలో తొలి విడత ఓపెన్‌ కేటగిరీలో 3,602 ర్యాంకర్‌కు సీటు రాగా, రెండో విడతలో గరిష్ఠంగా 20,797 ర్యాంకు వారికి సీటు దక్కింది. ఈ కళాశాలలోనే ఈడబ్ల్యూఎస్‌ కింద తొలి విడతలో 22,628 ర్యాంకుకు సీటు దక్కగా.. మలి విడతలో 41,775 ర్యాంకు వారికీ లభించింది. ఎస్సీ కేటగిరీలో ఉస్మానియా తొలి రౌండ్‌లో గరిష్ఠంగా 37,750 ర్యాంకర్‌కు.. రెండో రౌండ్‌లో 1.09 లక్షల ర్యాంకర్‌కు సీటు దక్కడం గమనార్హం.


ఎస్టీలో ఇదే కళాశాలలో తొలి విడత 31,994 ర్యాంకర్‌కు సీటు దక్కగా.. రెండో రౌండ్‌లో 1.15 లక్షలకు సీటు వచ్చింది. గాంధీ వైద్య కళాశాలలోనూ కొంచెం అటుఇటుగా ఇలాగే సీట్లు దక్కాయి. ఓపెన్‌లో తొలి విడత కౌన్సెలింగ్‌లో అఖిల భారత ర్యాంకు 3,077కు సీటు రాగా, మలి విడతలో 11,448 ర్యాంకు విద్యార్థికి సీటు దక్కింది. ఈడబ్ల్యూఎ్‌సలో తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌లో 13,354 ర్యాంకర్‌కు, రెండో దశలో 37,190 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీలో మొదటి విడతలో 12,473 ర్యాంకర్‌కు, రెండో విడతలో 77,168 ర్యాంకుకు సీటు వచ్చింది.


  • నీట్‌ ఎంబీబీఎ్‌సలో ఎస్సీ గురుకుల విద్యార్థుల రికార్డు

ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న 174 మంది విద్యార్థులకు నీట్‌ ఎంబీబీఎ్‌సలో ప్రవేశాలు లభించాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. సాయివంశీ 438 ర్యాంకుతో గాంధీలో, హేమంత్‌ (1791), శ్రుతి (3378) ఉస్మానియాలో సీట్లు పొందారని చెప్పారు. వివిధ కళాశాల్లో కొందరు విద్యార్థులకు సీట్లు దక్కాయన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 03:51 AM