ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సురేశ్‌ కుమార్‌

ABN, Publish Date - Nov 19 , 2024 | 03:07 AM

సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు సచివాలయ అధికారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత కొత్త సంఘానికి సోమవారం ఎన్నికలు జరిగాయి.

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు సచివాలయ అధికారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత కొత్త సంఘానికి సోమవారం ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన సంఘం 2025 నుంచి 2027 వరకు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా జి.సురేశ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. అనుబంధ అధ్యక్షుడిగా కే.ఎ్‌స.ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు-1గా డి.అంజన్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు-2గా ఎం.రామ్‌సింగ్‌, ఉపాధ్యక్షురాలు-3గా డి.లలితకుమారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పి.లింగమూర్తి ఎన్నికయ్యారు. నూతన సచివాలయ అధికారుల సంఘాన్ని ఎమ్మెల్సీ కోదండరామ్‌, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు అభినందించారు.

Updated Date - Nov 19 , 2024 | 03:07 AM