New Year: సౌండ్ పెంచితే.. మీ పని అవుట్..
ABN, Publish Date - Dec 31 , 2024 | 10:10 AM
న్యూ ఇయర్ వేడుకల నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నిబంధనలు పాటించాలని, ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రై కమిషనరేట్ సీపీలు సీవీ ఆనంద్, అవినాష్ మహంతి, సుధీర్‌బాబు(CPs CV Anand, Avinash Mohanty, Sudheer Babu) హెచ్చరించారు.
- సీసీటీవీల నిఘా తప్పనిసరి
- డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు
- అశ్లీల నృత్యాలు నిర్వహించొద్దు..
- నిబంధనలు జారీ చేసిన ట్రై కమిషనరేట్ సీపీలు
హైదరాబాద్ సిటీ: న్యూ ఇయర్ వేడుకల నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నిబంధనలు పాటించాలని, ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రై కమిషనరేట్ సీపీలు సీవీ ఆనంద్, అవినాష్ మహంతి, సుధీర్‌బాబు(CPs CV Anand, Avinash Mohanty, Sudheer Babu) హెచ్చరించారు. ఈ మేరకు నిర్వాహకులు పాటించాల్సిన నియమనిబంధనలను వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మద్యం బాటిల్ విషయంలో గొడవ.. ఒకరి హత్య
ఇన్సిడెంట్ ఫ్రీగా ఈవెంట్స్ నిర్వహించాలని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు.. పార్కింగ్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించి, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, 3 స్టార్ అంతకు మించిన హోటళ్లలో 45 డెసిబుల్స్ కన్నా.. తక్కువ సౌండ్ సిస్టం ఉండేలా చూసుకోవాలన్నారు.
పబ్‌లు, క్లబ్బుల్లో..
వేడుకలు నిర్వహించే పబ్బులు, క్లబ్‌లు, రిసార్టుల నిర్వాహకులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేసినా, వినియోగించినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవెంట్స్‌కు తగ్గట్టుగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎలాంటి అశ్లీల నృత్యాలు, అసభ్య సంగీత విభావరులు నిర్వహించొద్దని సీపీలు హెచ్చరించారు.
పార్టీకి పాస్‌లు ఉన్న దంపతులను, కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించాలన్నారు. కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేసినట్లు తేలితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి మారణాయుధాలుగాని, లైసెన్స్‌డ్ గన్‌లు, తుపాకులు తీసుకురావొద్దని హెచ్చరించారు. ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసినా క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కస్టమర్స్‌కు ముందే చెప్పాలి..
నిర్వాహకులు మద్యం విషయంలో తగిన జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. తాగి బయటకు వచ్చే కస్టమర్‌లను వాహనాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగిన వారిని జాగ్రత్తగా ఇంటికి పంపాల్సిన బాధ్యత నిర్వాహకులే తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేయడానికి కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
Read Latest Telangana News and National News
Updated Date - Dec 31 , 2024 | 10:48 AM