ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Year: ‘మత్తు’లో ముంచేయాలని.. న్యూ ఇయర్‌ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్‌, గంజాయి దిగుమతి

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:03 PM

న్యూ ఇయర్‌(New Year) వేడుకలకు యువతను, ఆహూతులను ఆకర్షించడానికి పబ్‌లు, క్లబ్‌లు, రిసార్టుల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో దేశవిదేశాల నుంచి నగరానికి ఖరీదైన మద్యంతో పాటు రకరకాల మాదకద్రవ్యాలు కూడా కొందరు గుట్టుగా సరఫరా చేస్తుంటారు.

- స్మగ్లర్ల కదలికలపై పోలీసుల నిఘా

- మూతపడ్డ పరిశ్రమల్లో తనిఖీలు

హైదరాబాద్‌ సిటీ: న్యూ ఇయర్‌(New Year) వేడుకలకు యువతను, ఆహూతులను ఆకర్షించడానికి పబ్‌లు, క్లబ్‌లు, రిసార్టుల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో దేశవిదేశాల నుంచి నగరానికి ఖరీదైన మద్యంతో పాటు రకరకాల మాదకద్రవ్యాలు కూడా కొందరు గుట్టుగా సరఫరా చేస్తుంటారు. పార్టీ ప్రియులను మత్తులో ముంచేసి భారీగా కూడబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే రంగంలోకి దిగిన స్మగ్లర్స్‌.. గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలను నగరానికి దిగుమతి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాత ముఠాల ఆటకట్టిస్తుండటంతో కొత్త స్మగ్లర్స్‌ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి ముఠాలను గుర్తించి అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌ న్యూ), తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో (టి- న్యాబ్‌) అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ వార్తను కూడా చదవండి: Pushpak Buses: లింగంపల్లి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి పుష్పక్‌ బస్సులు


మూతబడ్డ పరిశ్రమల్లో గుట్టుగా డ్రగ్స్‌ తయారీ..

న్యూ ఇయర్‌ వేడుకలను లక్ష్యంగా చేసుకున్న కొంతమంది స్మగ్లర్స్‌.. నగరంలోనే గుట్టుగా డ్రగ్స్‌ తయారీకి పాల్పడిన ఘటనలు అనేకం గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నగర శివారు ప్రాంతాలైన రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్స్‌, సంగారెడ్డి పరిధిలోని పారిశ్రామిక కేంద్రాల్లో కొన్ని మూతపడ్డ పరిశ్రమలపై నార్కోటిక్‌ బ్యూరో అధికారులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పరిధిలో మూతపడ్డ పరిశ్రమలో గుట్టుగా డ్రగ్స్‌ను తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్‌ పోలీసులు పట్టుకున్నారు. రూ. 3 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే ముఠా మూతపడిన పరిశ్రమల్లో డ్రగ్స్‌ తయారు చేసి డీఆర్‌డీఏ అధికారులకు చిక్కింది. గతంలో రాచకొండ పరిఽధిలోని నాచారం, సైబరాబాద్‌ పరిధిలోని బాచుపల్లి, మియాపూర్‌, బొల్లారం, పటాన్‌చెరు, బాలానగర్‌(Miyapur, Bollaram, Patancheru, Balanagar), జీడిమెట్ల తదితర పారిశ్రామిక వాడల్లో మూతబడ్డ పరిశ్రమల్లో డ్రగ్స్‌ను తయారు చేస్తున్న ముఠాలు పోలీసులకు పట్టుబడిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మూతబడ్డ పరిశ్రమలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిసింది.


- న్యూ ఇయర్‌ వేడుకలను లక్ష్యంగా చేసుకొని స్మగ్లర్స్‌ గుట్టుగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది స్మగ్లర్స్‌ ఒడిశా నుంచి నగరానికి 21 కిలోల గంజాయిని రహస్యంగా తెచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులను ఇటీవల అరెస్టు చేశారు. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన నలుగురు, ఒడిశాకు చెందిన ఇద్దరు ఉన్నట్లు తెలిసింది.

- న్యూ ఇయర్‌ వేడుకలే లక్ష్యంగా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ నగరానికి గుట్టుగా మాదక ద్రవ్యాలు (పప్పీ స్ట్రా) దిగుమతి చేసుకొని.. నగరంలో విక్రయించి, సొమ్ము చేసుకుంటున్న రాజస్థాన్‌ ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.25 కోట్లు విలువైన 53.5 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్నారు.


- మొగల్‌పురా పరిధిలో బ్రౌన్‌ హెరాయిన్‌ డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు స్మగ్లర్స్‌ను, వినియోగదారుడిని మొగల్‌పురా పోలీసులతో కలిసి, సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్‌ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

- ఒడిశా నుంచి హైదరాబాద్‌కు హాష్‌ ఆయిల్‌ను గుట్టుగా సరఫరా చేస్తున్న నిందితుడిని ఇటీవల ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.5లక్షల విలువైన 1.5కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం

ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 18 , 2024 | 12:03 PM